e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 22, 2021
Home జనగాం కరోనా కట్టడి కోసం..

కరోనా కట్టడి కోసం..

కరోనా కట్టడి కోసం..

నర్సంపేట, మే 8: కరోనా వైరస్‌ను తరిమికొట్టేందుకు జిల్లాలో శానిటేషన్‌ కార్యక్రమాలను ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గ్రామాలు, పట్టణాల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేస్తున్నారు. అలాగే, వీధుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ను చల్లుతున్నారు. నర్సంపేట పట్టణంలోని పలు వీధుల్లో వార్డు కౌన్సిలర్లు నాగిశెట్టి పద్మప్రసాద్‌, దార్ల రమాదేవి రసాయనాలను పిచికారీ చేయించారు. కరోనా పాజిటివ్‌ వచ్చిన వారు హోం ఐసొలేషన్‌లో ఉండాలని సూచించారు.
చెన్నారావుపేట: మండలంలోని అమీనాబాద్‌, అక్కల్‌చెడ, పాపయ్యపేట, బోజేర్వు, చెన్నారావుపేట, జల్లి, ఖాదర్‌పేటలో పారిశుధ్య పనులు ముమ్మరంగా జరుగుతున్నాయి. జల్లి గ్రామంలో సర్పంచ్‌ అంబాల సుధాకర్‌ ఆధ్వర్యంలో జీపీ సిబ్బంది శనివారం రసాయనాలు పిచికారీ చేశారు. డ్రైనేజీలను శుభ్రం చేసి చెత్తాచెదారాన్ని డంపింగ్‌ యార్డుకు తరలించారు. వీధుల్లో బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లారు.
దామెర: మండలంలోని ఊరుగొండ, ల్యాదెళ్ల, పులుకుర్తి, దుర్గంపేట, తక్కళ్లపహాడ్‌, ముస్త్యాపల్లి, వెంకటాపురంలో పంచాయతీ సిబ్బంది ప్రజలకు కరోనాపై అవగాహన కల్పించారు. మాస్కులు ధరించాలని, చేతులను శానిటైజర్‌తో శుభ్రం చేసుకోవాలని కోరారు. వీధుల్లో సోడియం హైపోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేశారు. కార్యక్రమాల్లో సర్పంచ్‌లు సత్యనారాయణరెడ్డి, కుక్క శ్రావణ్య, వై రాజేశ్వరి, బింగి రాజేందర్‌, వీ శ్రీనివాస్‌, పీ రజిత పాల్గొన్నారు.
గ్రామాల్లో శానిటేషన్‌ పనులు
సంగెం: మండలంలో కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుతున్న దృష్ట్యా సర్పంచ్‌లు వైరస్‌ కట్టడికి పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నారు. పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్న రాంచంద్రాపురం, గవిచర్ల, మొండ్రాయి, సంగెం, తిమ్మాపురం, పల్లార్‌గూడ, కాట్రపల్లిలో ప్రజలు స్వచ్ఛంద లాక్‌డౌన్‌ పాటిస్తున్నారు. గ్రామాల్లో జీపీ సిబ్బంది రసాయనాలను స్ప్రే చేస్తున్నారు.
గీసుగొండ: మండలంలోని గంగదేవిపల్లి, గీసుగొండ, విశ్వనాథపురంలో కరోనా కేసులు పెరుగుతుండడంతో సర్పంచ్‌లు బ్లీచింగ్‌ పౌడర్‌ చల్లించి హైడ్రోక్లోరైట్‌ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఈ సందర్భంగా గంగదేవిపల్లి సర్పంచ్‌ గోనె మల్లయ్య మాట్లాడుతూ గ్రామంలో లాక్‌డౌన్‌ అమల్లో ఉన్నందున ఎవరూ బయటకు రావొద్దని సూచించారు. కార్యక్రమంలో సర్పంచ్‌లు నాగేశ్వర్‌రావు, బాబు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
కరోనా కట్టడి కోసం..

ట్రెండింగ్‌

Advertisement