e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Wednesday, June 16, 2021
Home జనగాం తల్లిదండ్రులను కోల్పోయి న పిల్లలను ఆదుకుంటున్నాం

తల్లిదండ్రులను కోల్పోయి న పిల్లలను ఆదుకుంటున్నాం

తల్లిదండ్రులను కోల్పోయి న పిల్లలను  ఆదుకుంటున్నాం

జిల్లా బాలల సంరక్షణ అధికారి మహేందర్‌రెడ్డి
దామెర, జూన్‌ 7: కరోనాతో తల్లిదండ్రులను కోల్పోయి న పిల్లలను ప్రభుత్వం ఆదుకుంటున్నదని జిల్లా బాలల సంరక్షణ అధికారి (డీసీపీవో) జీ మహేందర్‌రెడ్డి అన్నారు. కొవిడ్‌ సోకి తల్లిదండ్రులు మృతి చెందడంతో పిల్లల పరిస్థితి దయనీయంగా మారింది. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్‌ హరిత ఆదేశాల మేరకు సోమవారం ఆయా మండలాలకు వెళ్లి మృతుల కుటుంబాలను పరామర్శించి 16 రకాల నిత్యావసర సరుకులు, రూ.10 00 నగదును అందజేసినట్లు డీసీపీవో తెలిపారు. జిల్లాలో తల్లిదండ్రులను కోల్పోయిన 18 సంవత్సరాల లోపు పిల్లల వివరాలను వెంటనే అంగన్‌వాడీ టీచర్లు, పౌరులు ఎవరైనా జిల్లా బాలల పరిరక్షణ విభాగం అధికారులకు సమాచారం ఇస్తే బాలలకు వసతి, విద్యాబోధన అంశాలపై తగిన నిర్ణయం తీసుకుంటామన్నారు. ఇప్పటివరకు జిల్లాలో కరోనా కారణంగా 25 కుటుంబాల నుంచి 45 మంది బాలలు తల్లిదండ్రులను కోల్పోయినట్లు గుర్తించామని చెప్పా రు. ఈ పిల్లలను బా లల పరిరక్షణ అధికారులు కలిసి సంపూర్ణ సహాయ సహకారాలు అందజేస్తారని అన్నారు. కార్యక్రమంలో పరకాల ఐసీడీఎస్‌ సీడీపీవో భాగ్యలక్ష్మి, ఎంపీడీవో కృష్ణమూర్తి, సూపర్‌వైజర్లు పద్మావతి, కళ్యాణి, ప్రొటెక్షన్‌ అధికారి డీ రాజు, అవుట్‌ రీచ్‌ వర్కర్‌ సుమన్‌, ఆయా గ్రామాల సర్పంచ్‌లు, కార్పొరేటర్‌ మనోహర్‌, డీసీసీబీ డైరెక్టర్‌ రమేశ్‌, అంగన్‌వాడీ టీచర్లు అనిత, పద్మ, శ్రీలక్ష్మి, ఆశాలు పాల్గొన్నారు.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
తల్లిదండ్రులను కోల్పోయి న పిల్లలను  ఆదుకుంటున్నాం

ట్రెండింగ్‌

Advertisement