e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Friday, June 25, 2021
Home జనగాం సాధనలో పాలనలో..

సాధనలో పాలనలో..

సాధనలో పాలనలో..

స్వరాష్ట్రం కోసం సబ్బండ వర్గాల్లో చైతన్యం
ఉమ్మడి పాలనలో మరుగునపడ్డ మన చరిత్రకు జీవం
సకల జనుల వేదనను వెలుగులోకి తెచ్చిన తెగువ
ఎన్నెన్నో ఫీచర్లతో ప్రజలకు చేరువ
పదకొండో వసంతంలోకి ‘నమస్తే’ నేడు పత్రిక పదో వార్షికోత్సవం

వరంగల్‌, జూన్‌ 5 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తెలంగాణ మానస పుత్రిక, ఆత్మగౌవర ప్రతీకైన నమస్తే తెలంగాణ దినపత్రిక నేడు 11వ వసంతంలోకి అడుగిడుతున్నది. నాడు తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా పనిచేసిన ఈ పత్రిక ప్రత్యేక ఆకాంక్షను ఎలుగెత్తి చాటింది. రాష్ట్ర ఆవిర్భావంలో కీలక పాత్ర పోషించడంతో పాటు ప్రజా సమస్యలపైనా యుద్ధం చేసింది. ఫీచర్లు, అన్ని అంశాలూ మేళవించిన వార్తలతో అశేష జనాదరణ పొంది గడిచిన పదేళ్లలో ఎన్నో విజయాలను అందుకున్నది. 2011 జూన్‌ 6న పత్రిక ప్రారంభ మైనప్పటి నుంచి తెలంగాణ సాధన ఉద్యమంలో ప్రజల ఆకాంక్షలకు పతాకగా నిలిచింది. స్వరాష్ట్రం ఎందుకు కావాలో వివరంగా చెప్పింది. రాష్ట్ర సాధన కోసం పని చేస్తున్న వారి గొంతుకగా మారి తెలంగాణ ప్రజల గుండె చప్పుడు అయింది. స్వరాష్ట్రం సిద్ధించిన తర్వాత బంగారు తెలంగాణ సాధనలో ప్రజలకు, ప్రభుత్వానికి మధ్య వారధిలా నిలుస్తున్నది. ప్రజల అవసరాలను తీర్చే విషయాల్లో ముందుంటున్నది. ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజల దరి చేరుస్తున్నది. అవినీతి, అక్రమాలకు తావులేకుండా అధికాయంత్రాంగాన్ని జాగృతం చేస్తూనే.. ప్రభుత్వం అమలుచేస్తున్న ప్రతి పథకాన్ని పార దర్శకంగా ప్రజలకు చేరేలా చేస్తున్నది. ఉద్యమ సమయంలో ఉమ్మడి పాలన వల్ల తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని వెలుగులోకి తెచ్చింది.

స మైక్య పాలకులు, మీడియా చేస్తున్న దగాను, బహిర్గతం చేసింది. నిరసన లు, ఆందోళనలు, ర్యాలీలు, రాస్తారోకోలు చేసిన ఉద్యమకారులకు వెన్ను దన్నుగా నిలిచింది. అణగారిన వర్గాలు ఎదుర్కొంటున్న సమస్యలు, కునా రిల్లిన కులవృత్తులను వెలుగులోకి తెచ్చింది. మొదటినుంచీ రైతులు, కూ లీలు, కార్మికులు, చిరువ్యాపారుల పక్షాన నిలిచింది. సింగరేణి కార్మికులు, ఆర్టీసీ కార్మికులు, ఇతర అసంఘటిత రంగ కార్మికుల సమస్యలపై రాసింది. అధికారుల్లో అవినీతి, అక్రమాలను ఎండగట్టింది. గతంలో డీసీసీబీలో జరిగిన భారీ కుంభకోణాన్ని బ యటపెట్టింది. తెలంగాణ కోసం బలిదానం చేసుకున్నవారి కు టుంబాలకు అండగా నిలిచింది. నమస్తే తెలంగాణ వెల్ఫేర్‌ ఫండ్‌ను సమకూర్చి బాధిత కుటుంబాలకు అందజేసి కన్నీరు తుడిచింది. స్వరాష్ట్ర సాధన సమయంలో రాజకీయవేత్తలు, మేధావులతో చర్చాగోష్టులు పెట్టి వారి నుంచి వచ్చిన సలహాలు, సూచనలను ఉద్యమ కారులకు అందించింది. ఉమ్మడి పాలనలలో కను మరుగైన వేల ఏళ్ల చరిత్రను వెలుగులోకి తెచ్చింది.

ఆంధ్రా పాలనలో ఈసడింపునకు గురైన మన భాషను, యాసను సగర్వంగా ప్రచురించి ప్రపంచానికి చాటింది. మన తెలంగాణ తెలుగునే సినిమాలు, సీరియళ్లలో వాడే పరిస్థితి కల్పించింది. వివిధ శాఖాల్లో అవినీతి పరుల తీరును ఎండగట్టింది. రెవె న్యూలో వేళ్లూనుకుపోయిన అక్రమాలను వెలుగులోకి తె చ్చింది. ‘ధర్మగంట’ ద్వారా వందలామంది రైతుల భూ సమస్యలను పరిష్కరించింది. ధరణి పోర్టల్‌పై సమగ్ర స మాచారా న్నిచ్చింది. దవాఖానల దోపిడీ తీరును సైతం ఎండ గట్టింది. విద్యాశాఖను గాడినపడేలా చేసింది. ఉపాధ్యాయుల సాధకబాదకాలను సైతం ప్రచురించింది. కుల, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలకు ఊతంలా నిలిచింది. రాష్ట్ర అవతరణ తర్వాత ప్రజలు, ప్రభుత్వానికి మధ్య వారధిలా పనిచేస్తున్నది. పథకాలు పకడ్బందీగా అమలుకావడంలో పెద్దన్నపాత్ర పోషి స్తున్నది. వివిధ పథకాలు ప్రతి ఒక్కరికీ తెలిసేలా వివరిస్తున్నది. ప్రస్తుత కరోనా కాలంలోనూ ప్రజలను అప్రమత్తం చేయడంలో క్రియా శీలక పాత్ర వహిస్తున్నది. లేనిపోని భయాలను పోగొడు తున్నది. ప్రభుత్వ దవాఖానలపై ప్రజల్లో నమ్మకాన్ని కలిగిస్తున్నది. పేదల కష్టాలు, కన్నీళ్లకు అక్షర రూపం ఇస్తూ ప్రభుత్వం తరఫున సాయం అందేలా చేసింది.

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
సాధనలో పాలనలో..

ట్రెండింగ్‌

Advertisement