Rain in Jangaon | రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఇవాళ రాత్రి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా జనగాంలో భారీ వర్షం కురిసింది. ఈదురుగాలులతో కూడిన భారీ వర్షంతో జనగాం తడిసి ముద్దయింది. నర్మెట్ట మండలంలో వడగళ్ల వాన కురిసింది. అలాగే.. జిల్లాలోని పలు ప్రాంతాల్లో వర్షం పడింది.