e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, December 7, 2021
Home జనగాం పుష్కరాలకు ప్రతిపాదనలు పంపండి

పుష్కరాలకు ప్రతిపాదనలు పంపండి

కాళేశ్వరంలో 12 రోజుల పాటు ప్రాణహిత పుష్కరాలు
పారిశుధ్య పనులు పగడ్బందీగా జరిగేలా చూడాలి
జయశంకర్‌ జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా
వివిధ శాఖల జిల్లా అధికారులకు ఆదేశాలు

భూపాలపల్లి రూరల్‌, నవంబర్‌ 24: ప్రాణహిత పుష్కరాలను సమర్థవంతంగా నిర్వహించడానికి అవసరమైన బడ్జెట్‌ కోసం ప్రతిపాదనలు అందించాలని జయశంకర్‌ జిల్లా కలెక్టర్‌ భవేశ్‌ మిశ్రా వివిధ శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్‌లో ప్రాణహిత పుష్కరాలు-2022 నిర్వహణపై జిల్లా సంయుక్త కలెక్టర్‌ కూరాకుల స్వర్ణలత, అదనపు కలెక్టర్‌ టీఎస్‌ దివాకరతో ఆయా శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పన్నెండేళ్లకు ఒకసారి వచ్చే ప్రాణహిత పుష్కరాలను జిల్లాలోని కాళేశ్వరంలో వైభవంగా నిర్వహించేందుకు శాఖల వారీగా అవసరమైన బడ్జెట్‌ ప్రతిపాదనలను పూర్తి స్థాయిలో అందజేయాలని ఆదేశించారు. ఏప్రిల్‌ 13 నుంచి 24వ తేదీ వరకు పుష్కరాలు జరుగనున్నాయన్నారు. త్రివేణి సంగమమైన కాళేశ్వరంలో 12 రోజుల పాటు నిర్వహించనున్న పుష్కరాలకు భక్తులు అధిక సంఖ్య లో తరలిరానున్నారని, ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా సౌకర్యాలు కల్పించాలన్నారు. పరిసరాలు అపరిశుభ్రం కాకుండా పంచాయతీరాజ్‌ శాఖ వారు పారిశుధ్య కార్మికులను నియమించాలని సూచించారు. కాళేశ్వరం ప్రాంతం మొత్తం విద్యుత్‌ దీపాలను ఏర్పాటు చేయాలన్నా రు. కాళేశ్వరంలో రహదారుల వెడల్పు, మరమ్మత్తు పను లు చేపట్టాలని, సమాచార శాఖ వారు పుష్కరాల కవరేజీ కోసం మీడియా సెంటర్‌ ఏర్పాటు చేయాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు మెడికల్‌ క్యాంపులు ఏర్పాటు చే యాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణకు పోలీసులు బం దోబస్తు ఏర్పాటు చేయాలని అన్నారు. నది వద్ద గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో జిల్లా పంచాయతీ అధికారి ఆశాలత, విద్యుత్‌శాఖ ఎస్‌ఈ మల్సూర్‌, పంచాయతీరాజ్‌ ఈఈ వెంకటేశ్వర్లు, ఆర్‌డబ్ల్యూస్‌ ఈఈ నిర్మల, కాటారం డీఎస్పీ బోనాల కిషన్‌, డీపీఆర్‌వో రవికుమార్‌, ఆర్టీసీ డీఎం ధరమ్‌సింగ్‌, జిల్లా టూరిజం అధికారి శివాజీ, నేషనల్‌ హైవే ఏఈఈ చేతన్‌, అగ్ని మాపక అధికారి రాణాప్రతాప్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
- Advertisement -
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement