కన్నడ భామ రష్మిక మందన్నా పలు బాలీవుడ్ ప్రాజెక్టులను లైన్ లో పెట్టిన విషయం తెలిసిందే. ఈ లిస్ట్ లో ఉన్న మోస్ట్ ప్రెస్టీజియస్ ప్రాజెక్టు గుడ్ బై. అమితాబ్ బచ్చన్, తప్పడ్ ఫేం పవెయిల్ గులాటి లీడ్ రోల్ లో నటిస్తున్నారు. గుడ్ బై మూవీ సెట్స్ లో అమితాబ్ బచ్చన్, రష్మిక ఉన్న స్టిల్ ఒకటి ఆన్ లైన్ లో లీకైంది. అమితాబ్ బచ్చన్ ఏదో చెప్తుంటే పక్కనే ఉన్న రష్మిక ఆసక్తిగా వింటున్నట్టుగా ఉంది.
బిగ్ బీ బంధ్గాలా కుర్తా, పైజామాలో సాల్ట్ పెప్పర్ లుక్ లో కొత్తగా కనిపిస్తున్నారు. నీనా గుప్తా ఫీమేల్ లీడ్రోల్ చేస్తోంది. రష్మిక మందన్నా మరోవైపు సిద్దార్థ్ మల్హోత్రాతో మిషన్ మజ్ను చిత్రంలో నటిస్తోంది. స్పై థ్రిల్ర్ గా తెరకెక్కుతున్న ఈ మూవీని శాంతను బాగ్చి డైరెక్ట్ చేస్తున్నాడు. అమితాబ్ బచ్చన్ తో కలిసి నటించే ఛాన్స్ రావడం పట్ల చాలా ఎక్జయిటింగ్ గా ఉన్నట్టు ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా చెప్పింది రష్మిక. ఇక చాలా రోజుల తర్వాత ఎక్జయిటింగ్ మూవీ సెట్స్ లో జాయిన్ అయినట్టు తాజా స్టిల్ తో అర్థమవుతుంది.
ఇవి కూడా చదవండి..
వెయిట్ లిఫ్టర్ లా సారా అలీఖాన్..వీడియో హల్చల్
నారప్ప, దృశ్యం 2..డీల్ ఏంతో తెలిస్తే షాకే..!
తెరపైకి ‘దర్శకరత్న’ దాసరి బయోపిక్..వివరాలివే..!