ఎమ్మెల్సీ ఎన్నికల్లో ‘పల్లా’దే విజయం

- టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన
- రాజ్యసభలో ఉపనేత డాక్టర్ బండా ప్రకాశ్
పాలకుర్తి రూరల్ ఫిబ్రవరి 23 : త్వరలో జరుగనున్న నల్లగొండ, వరంగల్, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ బలపర్చిన అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి విజయం ఖాయమని రాజ్యసభలో టీఆర్ఎస్ పక్ష ఉప నేత డాక్టర్ బండా ప్రకాశ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో ఎన్నికలు ఏవైనా సీఎం కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్దే విజయమన్నారు. పార్టీ సభ్యత్వ నమోదుకు అనూహ్య స్పందన లభిస్తున్నదన్నారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని, ఆదానీ అంబానీలకు దాసోహమయ్యారని ధ్వజమెత్తారు. బీజేపీ పాలనలో ఉద్యోగాల భర్తీ విస్మరించారని ప్రకాశ్ విమర్శించారు. కేంద్రం తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నదని, వివిధ రంగాల్లో అవార్డులు ఇస్తున్నది తప్ప రాష్ర్టాభివృద్ధికి నిధులు ఇవ్వడం లేదన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రైవేటీకరణకు పెద్ద పీట వేస్తున్నదని, బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీని, కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీని విస్మరించారని అన్నారు. రాష్ట్రంలోని బీజేపీ ఎంపీలతో పాటు ప్రతి పక్ష ఎంపీలు తెలంగాణ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన మండిపడ్డారు. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి తెలంగాణకు రావాల్సిన నిధులపై ఏనాడైనా సమీక్ష నిర్వహించారా అని ప్రశ్నించారు. బీజేపీ పాలనలో పెట్రోలు, డీజిల్, వంటగ్యాస్ ధరలు పెరిగాయని, అయినా ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ నాయకులకు పట్టభద్రుల ఓట్లు అడిగే అర్హత లేదన్నారు. ఢిల్లీలో రైతు వ్యతిరేక చట్టాలను సమర్ధించే బీజేపీ ఎంపీలు, నాయకులు రాష్ట్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులకు వెళ్లి రైతులకు చెప్పగలరా అని ఆయన ప్రశ్నించారు. ఈ సమావేశంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌కుమార్, జడ్పీ ఫ్లోర్ లీడర్ పుస్కూరి శ్రీనివాస్‌రావు, ఎఫ్ఎస్సీఎస్ బ్యాంక్ చైర్మన్ బొబ్బల అశోక్‌రెడ్డి, పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ చైర్మన్ ముస్కు రాంబాబు, సర్పంచ్ వీరమనేని యాకాంతారావు, చిక్కుడు రాములు, కడుదుల కరుణాకర్‌రెడ్డి, మాచర్ల ఎల్లయ్య, తరాల చంద్రబాబు, కమ్మగాని నాగన్న, సుధాకర్‌రెడ్డి, దాసరి మధు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యమంలా సభ్యత్వ నమోదు
మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు టీఆర్ఎస్ నాయకులు గ్రామాల్లో ఉత్సాహంగా సభ్యత్వాలు చేయిస్తున్నారు. మంగళవారం మండలంలోని తిరుమలగిరిలో పాలకుర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ ముస్కు రాంబాబు, విస్నూరులో గజ్జి సంతోశ్‌కుమార్ సభ్యత్వాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఈర్ల రాజు, కూటికంటి రాజు, బక్క నాగరాజు, కొడకండ్ల వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఎర్రబెల్లి రాఘవరావు, ఎండీ అఫ్రోజ్, నకీర్త యాకయ్య, యాకయ్య పాల్గొన్నారు.
తాజావార్తలు
- రసవత్తరంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికలు
- ఐపీఎల్ షెడ్యూల్ విడుదల.. ఏప్రిల్ 9న తొలి మ్యాచ్
- ఐటీ సోదాలు.. బయటపడిన వెయ్యి కోట్ల అక్రమాస్తులు!
- సోనియా అధ్యక్షతన కాంగ్రెస్ స్ట్రాటజీ గ్రూప్ సమావేశం
- వాణీదేవిని భారీ మెజార్టీతో గెలిపించండి : మంత్రి కేటీఆర్
- తమిళనాడు, కేరళలో అమిత్‌షా పర్యటన
- కాసేపట్లో మోదీ ర్యాలీ.. స్టేజ్‌పై మిథున్ చక్రవర్తి
- న్యూయార్క్‌లో రెస్టారెంట్ ప్రారంభించిన ప్రియాంక చోప్రా
- ఆరు రాష్ట్రాల్లోనే 84.71 శాతం కొత్త కేసులు: కేంద్రం
- ఫాస్టాగ్ కొంటున్నారా.. నకిలీలు ఉన్నాయి జాగ్రత్త!