సోమవారం 08 మార్చి 2021
Jangaon - Feb 24, 2021 , 01:41:05

పల్లా నామినేషన్‌కు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

పల్లా నామినేషన్‌కు తరలిన టీఆర్‌ఎస్‌ శ్రేణులు

స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఫిబ్రవరి 23 : నల్లగొండ, వరంగల్‌, ఖమ్మం ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి టీఆర్‌ఎస్‌ బలపర్చిన పల్లా రాజేశ్వర్‌రెడ్డి మంగళవారం నల్లగొండలో నామినేషన్‌ వేసిన సందర్భంగా స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గం నుంచి టీఆర్‌ఎస్‌ శ్రేణులు తరలివెళ్లాయి. ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య, జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి నేతృత్వంలో నియోజకవర్గంలోని ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వాహనాల్లో పెద్ద సంఖ్యలో వెళ్లారు. ఇదిలా ఉండగా ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్‌ దాఖలు చేసిన పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఎమ్మెల్యే రాజయ్య, వరంగల్‌ ఎంపీ పసునూరి దయాకర్‌ శుభాకాంక్షలు తెలిపారు. వారి వెంట గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ ఎడవెళ్లి కృష్ణారెడ్డి, జడ్పీటీసీ మారపాక రవి, కుడా డైరెక్టర్‌ ఆకుల కుమార్‌, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు అన్నం బ్రహ్మారెడ్డి, ఎంపీపీలు కందుల రేఖాగట్టయ్య, కవిత, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు గట్టు రమేశ్‌, సర్పంచ్‌లు తాటికొండ సురేశ్‌కుమార్‌, కర్ర సోమిరెడ్డి, బెలిదె వెంకన్న, అక్కినపల్లి బాలరాజు ఉన్నారు.

జఫర్‌గఢ్‌లో..

జఫర్‌గఢ్‌ : ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామినేషన్‌ కార్యక్రమానికి మండల నుంచి టీఆర్‌ఎస్‌ నాయకులు మంగళవారం నల్లగొండకు తరలి వెళ్లారు. నాయకులు మాట్లాడుతూ ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య, ఎమ్మెల్సీ కడియం శ్రీహరి ఆదేశాల మేరకు వెళ్లామని పేర్కొన్నారు. తరలివెళ్లిన వారిలో ఎంపీపీ రడపాక సుదర్శన్‌, జడ్పీటీసీ ఇల్లందుల బేబి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కరుణాకర్‌రావు, వైస్‌ ఎంపీపీ కనకయ్య, రైతుబంధు సమితి జిల్లా సభ్యులు అన్నం బ్రహ్మారెడ్డి, నీరజారెడ్డి, మండల కోఆర్డినేటర్‌ శంకర్‌, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు గుజ్జరి రాజు, ఇల్లందుల శ్రీనివాస్‌, అన్నెపు అశోక్‌, చిరంజీవి, సుధాకర్‌బాబు, పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ అయోధ్య తదితరులు ఉన్నారు.

కొడకండ్లలో..

జఫర్‌గఢ్‌ : టీఆర్‌ఎస్‌ శ్రేణులు మంగళవారం నల్లగొండకు తరలివెళ్లాయి. ఎమ్మెల్సీ అభ్యర్థిగా పల్లా రాజేశ్వర్‌రెడ్డి నామి నేషన్‌ వేయడంతో మండలం నుంచి ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ్యలో వాహనాల్లో వెళ్లారు. వెళ్లిన వారిలో వ్యవసాయ మార్కెట్‌ చైర్మన్‌ పేరం రాము, డైరెక్టర్‌ దూలం సతీశ్‌, ఎంపీపీ జ్యోతి రవీంద్రగాంధీనాయక్‌, కొడకండ్ల స ర్పంచ్‌ పసునూరి మధుసూదన్‌ తదితరులు ఉన్నారు.

VIDEOS

logo