పరిష్కరించే గొంతు కావాలి

- ప్రతి బిడ్డ ఉద్యమ స్ఫూర్తిని చాటాలి
- పోరాటాలపై మాట్లాడే హక్కు బీజేపీకి లేదు
- టీఆర్ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి
- బీజేపీ నేతలను ఎక్కడికక్కడ నిలదీయాలె
- మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
- జనగామలో సన్నాహక సమావేశం
- హాజరైన ప్రభుత్వ చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి
- ప్రతి బిడ్డ ఉద్యమ స్ఫూర్తిని చాటాలి
జనగామ, నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 22 : నాటి సా యుధ పోరాటం నుంచి మలిదశ ఉద్యమం వరకు ఇక్కడి ప్రతి ఊరికి..ప్రతి బిడ్డకు ఓ చరిత్ర ఉందని, ఇక్కడ ప్రశ్నిం చే గొంతు కాదు.. సమస్యలు పరిష్కరించే గొంతుక కావాలని వరంగల్-ఖమ్మం-నల్లగొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ టీఆర్ఎస్ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. జనగామ జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన సోమవారం ఏర్పాటు చేసిన నియోకవర్గ పట్టభద్రులు, టీఆర్ఎస్ ప్రజాప్రతినిధుల సన్నాహక సమావేశంలో మం త్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, ప్రభుత్వ చీఫ్‌విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు, జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డితో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా పల్లా మాట్లాడుతూ వరంగల్, నల్లగొండ, ఖమ్మం ప్రాంతాల పోరాట స్ఫూర్తి గురించి బీజే పీ మాట్లాడడం విడ్డూరంగా ఉందని, ఈ ప్రాంతం గురించి మాట్లాడే హక్కు, నైతికత బీజేపీకి ఎక్కడిదని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ర్టాన్ని ప్రజల సహకారంతో ఉద్యమించి శాంతియుత, అహింసా పద్ధతుల్లో సీఎం కేసీఆర్ సాధించారని గుర్తుచేశారు. మన నీళ్లు మనకు తెచ్చిన మొనగాడు సీ ఎం కేసీఆర్ అని కొనియాడారు. బీజేపీ నేతలు అర్థంపర్థం లేకుండా మాట్లాడుతున్నారని, ఆ పార్టీ ఆధీనంలోని సం స్థలు మరో తీరుగా మొరుగుతున్నాయని మండిపడ్డా రు. ‘పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్న బీజేపీ వాళ్లే అసలైన బికారిగాళ్లు, ఒకడు శ్వేతపత్రం అంట డు.. ఒకడు ఎర్రపత్రం అం టడు.. ఇంకొకడు క్యాలెండర్ అంటడు.. ప్రధానిగా వాజ్పాయ్ ఉన్నప్పుడు ఏడు ప్రభుత్వ సంస్థలను ప్రైవేట్ పరం చేసిండు. ఇప్పుడు నరేంద్ర మోదీ 23 సంస్థలను ప్రైవేట్ పరం చేసిండు. రైల్వే ప్లాట్ఫారం మీద చాయ్ అమ్మి చివరకు రైల్వేనే అమ్మేసిండు..” అని ధ్వజమెత్తారు. 60లక్షల సభ్యత్వం ఉన్న టీఆర్ఎస్ పార్టీ వాళ్లు తిట్టడం మొదలు పెడితే ఆ గాలిలో కొట్టుకుపోతారని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతును కాదు..మీ సమస్యలను పరిష్కరించే వాళ్లను ఎన్నుకోండి అంటూ విజ్ఞప్తి చేశారు. త్వరలోనే 60వేల ఉద్యోగాలు వస్తాయని చెప్పారు.
ఎవరో పిచ్చికూతలు కూస్తుంటే
మనమెందుకు ఊకోవాలె : మంత్రి ఎర్రబెల్లి
సమావేశంలో మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ ‘ఎవరెవరో పిచ్చి కూతలు కూస్తుంటే మనం ఎందుకు మౌనంగా ఉండాలె? జనగామను జిల్లా చేసినం.. అడగకుండానే నీళ్లు తెచ్చినం, ఇంటింటికీ నల్లా ఇచ్చినం, మనమెందుకు నాదాను కావాలే.. మనం చేసింది చెప్పుకోవాలె.. తప్పులు మాట్లాడేవాళ్లను నిలదీయాలె” అంటూ కార్యకర్తలను ఉత్తేజపరిచారు. ‘బీజేపీ కోటి ఉద్యోగాలు అన్నది.. ఒక్కరికైనా కేంద్ర ఉద్యోగం వచ్చిందా? ఎవరి ఖాతాల్లోనైనా రూ.15లక్షలు జమైనయా?’ అని ప్రశ్నించా రు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి డైనమిక్ అభ్యర్థి అని మంచి చదు వు, వాక్కు పటిమ ఉన్న నేత ఆయన అని పేర్కొన్నారు. ఉద్యోగాల గురించి అడిగితే లెక్కలు చెప్పి మరీ నిలదీయాలని, వారేం చేశారో ప్రశ్నించాలని పిలుపునిచ్చారు. ‘రాష్ట్రం నుంచి రూ.2.72లక్షల కోట్లు పన్నుల రూపంలో కడితే కేవలం రూ.1.45లక్షల కోట్లు మాత్రమే కేంద్రం తిరిగి ఇస్తున్నది ఇది నిజం కాదా? బీజేపీ వాళ్లు చెప్పాలి’ అంటూ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నియో జకవర్గ కోఆర్డినేటర్ డాక్టర్ గుజ్జ సంపత్‌రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, మార్కెట్ చైర్పర్సన్ బాల్దె విజ య, పట్టణ, మండల పార్టీ అధ్యక్షులు బండ యాదగిరిరెడ్డి, బొడిగం చంద్రారెడ్డి, సుధాకర్, యాదగిరిగౌడ్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు తదితరులు పాల్గొన్నారు.
ఉద్యోగాల కల్పనలో దేశంలోనే తెలంగాణ టాప్
జనగామ టౌన్, ఫిబ్రవరి 22 : ఉద్యోగాల కల్పనలో దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలిచిందని ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రభుత్వ చీఫ్ విప్ బోడకుంటి వెంకటేశ్వర్లు, ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగరిరెడ్డి, జడ్పీ చైర్మన్ సంపత్‌రెడ్డితో కలిసి సోమవారం ఉదయం జనగామ పట్టణంలోని బతుకమ్మకుంటలో మార్నింగ్ వాకర్స్, పట్టభద్రులు, విద్యావంతులను కలిసి ఎన్నికల ప్రచారం చేశారు. రాష్ట్రంలో విద్యార్థులకు, యువకులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో మరిన్ని ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. బోడకుంటి మాట్లాడుతూ డబ్బా పార్టీలకు ఓట్లు వేసి మోసపోవద్దని సూచించారు. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి మాట్లాడుతూ మేధావులు టీఆర్ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. ఇక్కడ నియోజకవర్గ కో-ఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి, పట్టణాధ్యక్షుడు బండ యాదగిరి రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ పోకల జమున, లింగయ్య, పీఏసీఎస్ చైర్మన్ మహేందర్ రెడ్డి, కౌన్సిలర్ అనిత, చిట్ల ఉపేందర్ రెడ్డి, వంచ మనోహర్ రెడ్డి, నారోజు రామేశ్వరాచార్యులు, గజ్జెల నర్సిరెడ్డి, తిప్పారపు విజయ్, వాకర్స్ అసోసియేషన్ సభ్యలు పాల్గొన్నారు.