శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Feb 22, 2021 , 03:03:04

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఫొటోను కరెన్సీపై ముద్రించాలి

రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్‌ ఫొటోను కరెన్సీపై ముద్రించాలి

జనగామ టౌన్‌, ఫిబ్రవరి 21 : భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్‌ అంబేద్కర్‌ ఫొటోను ఇండియన్‌ కరెన్సీపై ముద్రించాలని టీఆర్‌ఎస్వీ జిల్లా కో-ఆర్డినేటర్‌ వంగ ప్రణీత్‌రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని బస్టాండ్‌ చౌరస్తాలో అం బేద్కర్‌ యువజన సంఘం ఆధ్వర్యంలో 13వ వారం జ్ఞానమాల వేసి మాట్లాడారు. ఆర్‌బీఐ సృష్టికర్త అంబేద్కర్‌ ఫొటోను ఇండియన్‌ కరెన్సీపై ము ద్రించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్‌ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాములు, అంబేద్కర్‌ యువజన సంఘం జిల్లా అధ్యక్షుడు గిరిమల్లె రాజు, అంబేద్కర్‌ ఫొటో సాధన సమితి జిల్లా అధ్యక్షుడు పులి శేఖర్‌, నాయకులు బక్క రవి, పులి శ్రీనివాస్‌, మేకల క్రాంతి, తిప్పారపు ప్రసాద్‌, పులి భరత్‌, తాళ్లపల్లి ఎల్లేశ్‌, బొల్లం బాబురావు, పులి సతీశ్‌, సృజన్‌, చింటు, అఖిల్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo