ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Feb 22, 2021 , 03:03:12

అవయవ దానంపై అవగాహన కల్పించాలి : రాజయ్య

అవయవ దానంపై అవగాహన కల్పించాలి : రాజయ్య

జఫర్‌గఢ్‌, ఫిబ్రవరి 21 : అవయవ దానం గొప్పదని, దీనిపై ప్రజలకు అవగాహన కల్పించాలని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని తీగారం గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్‌ గడ్డం యాకబాబు ఈ నెల 10న అనారోగ్యంతో మృతి చెందాడు. మృతదేహం నుంచి నేత్రాలను సదాశయ ఫౌండేషన్‌కు కుటుంబ సభ్యులు దానం చేశారు. ఈ నేపథ్యంలో ఆదివారం నిర్వహించిన యాకబాబు సంస్మరణ సభలో ఎమ్మెల్యే రాజ య్య మాట్లాడుతూ సమాజ సేవలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. యాకబాబు జీవించిన కాలంలో సమాజసేవ చేశారని, మరణానంతరం అవయవాలు దానం చేసి అందరికీ స్ఫూర్తిగా నిలిచారని రాజయ్య కొనియాడారు. అనంతరం సదాశయ ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో నేత్రదాత అభినందన పత్రాలను మృతుడి కుమారులు గడ్డం ధనుంజయ్‌, శ్రీనివాస్‌కు అందజేశారు. ఈ కార్యక్రమంలో సదాశయ ఫౌండేషన్‌ అధ్యక్షుడు శ్రావణ్‌ కుమార్‌, ప్రధాన కార్యదర్శి లింగమూర్తి, సభ్యులు గోపాల్‌రెడ్డి, ఆదిత్య, ఎంపీపీ రడపాక సుదర్శన్‌, సర్పంచ్‌ గోనె జైపాల్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు శివయ్య, నాయకులు రాజేశ్‌, రవి, కుమార్‌, వసంత్‌ నాయక్‌, లయన్స్‌ క్లబ్‌ బాధ్యులు వేణుగోపాల్‌ త్రివేది, రవీంద్రాచారి, భిక్షపతి, రాజు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo