అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయం

జఫర్‌గఢ్, ఫిబ్రవరి 20 : అన్నివర్గాల సంక్షేమమే సీఎం కేసీఆర్ ధ్యేయమని, అందుకనుగుణంగానే అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని ఎంపీటీసీల ఫోరం మండల అధ్యక్షుడు చిలువేరు శివయ్య అన్నారు. మండలం లోని తమ్మడపల్లి(జీ)లో శనివారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించారు. శివయ్య మాట్లాడుతూ టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొంటున్నారని వివరిం చారు. ఈ నాయకులు కొమురయ్య, యాదగిరి, రామస్వామి, సతీశ్, రాజేందర్, అనిల్, కిరణ్, రాజయ్య, సోమయ్య, యాదగిరి పాల్గొన్నారు.
ఉప్పుగల్లు నాయకులకు ఎమ్మెల్యే అభినందన
మండలంలోని ఉప్పుగల్లులో పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు పులి ధనుంజయ్ ఆధ్వర్యంలో 250 సభ్యత్వాలు పూర్తి చేశారు. అనంతరం ఎమ్మెల్యే రాజయ్యను శనివారం నాయకులు కలువగా ఆయన అభినందించారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్ సభ్యత్వానికి అపూర్వ ఆదరణ
పాలకుర్తి : టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు ప్రజల నుంచి అపూర్వ ఆదరణ లభిస్తున్నదని జడ్పీ కోఆప్షన్ సభ్యుడు ఎండీ మదార్ తెలిపారు. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు మండలంలోని బమ్మెరలో శనివారం పార్టీ సభ్యత్వ నమోదు నిర్వహించగా పెద్ద సంఖ్యలో వివిధ వర్గాల ప్రజలు సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ దార శారద, శంకరయ్య, టీఆర్ఎస్ గ్రామ కార్యదర్శి జోగు గోపి, నాయకులు సో మయ్య, మాచర్ల ఎల్లయ్య తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నిరుద్యోగుల కోసం మొబైల్ కెరీర్ కౌన్సెలింగ్ ల్యాబ్
- రాష్ట్రంలో మూడురోజులు పొడి వాతావరణం.. పెరగనున్న ఎండలు
- నాణ్యమైన పరిశోధనలు జరగాలి: ప్రొఫెసర్ గోపాల్‌రెడ్డి
- బండ చెరువు నాలా పనులను జీహెచ్ఎంసీకి అప్పగించాలి
- రాజకీయ దురుద్దేశంతోనే ర్యాంకింగ్‌ను తగ్గించారు
- వృద్ధులకు గ్రౌండ్‌ఫ్లోర్‌లోనే టీకాలు వేయాలి
- బీజేపీ ద్వంద్వ విధానాల్ని ఎండగట్టాలి
- అభివృద్ధి కావాలా..? అబద్ధాలు కావాలా..?
- తెలంగాణకు బీజేపీ చేసిందేమీ లేదు..
- అభివృద్ధిని చూసి ఎమ్మెల్సీలను గెలిపించాలి