సోమవారం 08 మార్చి 2021
Jangaon - Feb 21, 2021 , 02:11:15

పాడి రైతులకు తెలంగాణ సర్కారు ప్రోత్సాహం

పాడి రైతులకు తెలంగాణ సర్కారు ప్రోత్సాహం

  • రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌రావు 

స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఫిబ్రవరి 20 : పాడిపరిశ్రమను నమ్ము కున్న రైతులకు తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇస్తున్నదని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌, విజయ డెయిరీ ఎండీ గురిజాల శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం మండల కేంద్రంలోని పాలశీతలీకరణ కేంద్రం, చిల్పూర్‌ మండలం కృష్ణాజిగూడెంలోని సొసైటీని ఆయన పరిశీలించారు. అనంతరం చింతకుంట్ల ప్రభాకర్‌రెడ్డి అధ్యక్షతన పాడి రైతులతో నిర్వహించిన సమావేశంలో  మాట్లాడారు. విజయ డెయిరీ లాభాపేక్షతో కాకుండా రైతులకు ప్రయోజనం చేకూర్చేందుకు సహకరిస్తుందని శ్రీనివాస్‌రావు అన్నారు. పాడి రైతులను ఆదుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీపై పశువులకు దాణా, గడ్డి గింజలు ఇస్తున్నదని తెలిపారు. ఈ సమావేశంలో విజయ డెయిరీ ప్రత్యేకాధికారి నర్సింహారావు, డీడీ రమేశ్‌, మేనేజర్‌ కనుకదుర్గ, యాదలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

మోడల్‌ బల్క్‌ కూలింగ్‌ కేంద్రం గా 

పాలకుర్తి రూరల్‌ : జిల్లాలో పాలకుర్తి బల్క్‌ కూలింగ్‌ కేంద్రాన్ని మోడల్‌ కేంద్రంగా గుర్తించడంతోపాటు అభివృద్ధి చేస్తామని తెలంగాణ పాడి పరిశ్రమ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ గురజాల శ్రీనివాస్‌రావు అన్నారు. శనివారం స్థానిక ఎఫ్‌ఎస్‌సీఎస్‌ బ్యాంక్‌ ఆవరణలోని పాలశీతల కేం ద్రాన్ని ఆయన సందర్శించారు. అనంతరం మాట్లాడుతూ పాడి రైతులు ఆర్థికాభివృద్ధి సాధించడమే ప్రభుత్వ లక్ష్యమన్నారు. రాష్ట్రంలో మూడు వేల పాల సేకరణ కేంద్రాలుండ గా, జనగామ జిల్లాలో 226 కేంద్రాలున్నాయని ఆయన చెప్పారు. పాడి రైతులకు ఫెడరేషన్‌ ద్వారా రూ.10 వేల నగదు ఇస్తామని, బీమా వర్తింపజేస్తామన్నారు. ఆయన వెంట ప్రత్యేకాధికారి నర్సింహారావు, కనక దుర్గ, రమేశ్‌, నాలి శ్రీనివాస్‌, నాగరాజు ఉన్నారు.

 పాడి పరిశ్రమ అభివృద్ధికి కృషి

లింగాలఘనపురం : పాడి పరిశ్రమ అభివృద్ధికి విజయ డెయిరీ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నదని సంస్థ ఎండీ శ్రీనివాస్‌రావు తెలిపారు. మండలంలోని మాణిక్యపురంలో శనివారం ఏర్పాటు చేసిన ఉచిత పశువైద్యశిబిరాన్ని ఆయన ప్రారంభించారు. పాల ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు డేగల సిద్ధులు అధ్యక్షతన జరిగిన సమావేశంలో శ్రీనివాస్‌రావు మాట్లాడుతూ ప్రైవేట్‌ డెయిరీల పోటీని తట్టుకుని విజయ డెయిరీ ముందుకెళ్తున్నదన్నారు. పాడి రైతులకు ప్రత్యేక రాయితీలు ఇస్తున్నామని, పాల సేకరణ ధరను లీటరుకు రూపాయి పెంచామన్నారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్ధకశాఖ జిల్లా అధికారి డాక్టర్‌ భిక్షపతి, పశువైద్యులు మాళవిక, భగవాన్‌రెడ్డి, రాజశేఖర్‌, సతీశ్‌, సర్పంచ్‌ చౌదరపెల్లి శ్వేతాపూర్ణచందర్‌, నాయకులు సిద్ధులు, బాలయ్య, రోశయ్య, గణేశ్‌, కుమారస్వామి, యాదగిరి పాల్గొన్నారు.

VIDEOS

logo