స్వచ్ఛందంగా టీఆర్ఎస్ సభ్యత్వాల స్వీకరణ

- గ్రామాల్లో నాయకులకు అపూర్వ స్వాగతం
- సీఎం కేసీఆర్‌కు అండగా వెల్లడి
లింగాలఘనపురం, ఫిబ్రవరి 19 : టీఆర్ఎస్ సభ్యత్వ నమోదుకు అపూర్వ ఆదరణ లభిస్తున్నది. ఇందుకు నిదర్శనంగానే శుక్రవారం మండలంలోని నవాబుపేట అంగడిలో నారు విక్రయదారులు నాయకులను పిలిచి సభ్యత్వం తీసుకున్నారు. వివరాల్లో వెళ్తే.. మూడు దశాబ్దాలుగా తీవ్ర దుర్భిక్షం ఎదుర్కొంటున్న నవాబుపేట ప్రాంతంలో టీఆర్ఎస్ సర్కారు అధికారంలోకి వచ్చాక దేవాదుల ఎత్తిపోతల పథకంలో భాగంగా రిజర్వాయర్ నిర్మించారు. దీంతో గోదావరి జలాలు వస్తుండడంతో చెరువులు నింపుతుండడంతో ఈ ప్రాంతం సస్యశ్యామలమైంది. ఈ నేపథ్యంలో నారు విక్రయదారులకు ఉపాధి అవకాశాలు పెరిగాయి. ప్రతి శుక్రవారం నవాబుపేట అంగడికి వచ్చే నారు విక్రయదారులు సుమారు 50 మంది గులాబీ పార్టీకి ఆకర్శితులయ్యారు. అంగడి వద్ద గులాబీ కండువాతో ఉన్న టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్ పార్టీ సభ్యత్వాన్ని నమోదు చేస్తున్నారనే సమాచారం తెలుసుకున్న వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన నారు విక్రయందారులు ఆయనను పిలిచి సాధారణ సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు చింతల వెంకన్న, మల్లేశం, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.
టీఆర్ఎస్తోనే తెలంగాణ సస్యశ్యామలం : ఎంపీపీ
జనగామ రూరల్ : టీఆర్ఎస్ పాలనలోనే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం ఆవుతున్నదని ఎంపీపీ మేకల కలింగరాజు అన్నారు. శుక్రవారం మండలంలోని శామీర్‌పేటలో పార్టీ సభ్యత్వ నమోదును ఆయన ప్రారంభించి మాట్లాడారు. సీఎం కేసీఆర్ సహకారంతో నియోజకవర్గంలో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి నేతృత్వంలో అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల కార్యదర్శి ఎడ్ల శ్రీనివాస్, ఉప్పలయ్య, నమిలె శంకర్, క్రాంతి బాబు, దుబ్బాక ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.
సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటాం
స్టేషన్ ఘన్పూర్ : అన్ని వర్గాల సంక్షేమమే ధ్యేయంగా పాలన అందిస్తున్న సీఎం కేసీఆర్‌కు అండగా ఉంటామని చెబుతూ ప్రజలు టీఆర్ఎస్ సభ్యత్వం తీసుకుంటున్నారని పార్టీ పట్టణ అధ్యక్షుడు మునిగల రాజు అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలో పార్టీ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఆసరా పింఛన్లతోపాటు కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాల్లో లబ్ధిపొందిన వారితోపాటు 65 మంది మహిళలు స్వచ్ఛందంగా సభ్యత్వం తీసుకున్నారని ఆయన రాజు వివరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు మునిగల లక్ష్మి, దారం రాజేశ్వరి, సావిత్రి, మునిగల మోహన్ తదితరులు పాల్గొన్నారు.
పాలకుర్తిలో జోరుగా సభ్యత్వ నమోదు
పాలకుర్తి రూరల్ : టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు మండలంలో జోరుగా సాగుతోంది. మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆదేశాల మేరకు నాయకులు సభ్యత్వాలను చేయిస్తున్నారు. శుక్రవారం విస్నూరులో మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు ఎండీ అఫ్రోజ్‌కు పార్టీ సభ్యత్వాన్ని ఇవ్వగా, వావిలాలలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్ సభ్యత్వ నమోదు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నకీర్త యాక య్య, ఎంపీటీసీ మాటూరి యాకయ్య, భద్రయ్య చారి, అడ్డూరి మాధవరావు, భూపాల్‌రావు పాల్గొన్నారు.
సభ్యత్వ నమోదును
విజయవంతం చేయాలి
జఫర్‌గఢ్ : మండలంలోని అన్ని గ్రామాల్లో టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని రఘునాథపల్లిలో శుక్రవారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు చేపట్టారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే రాజయ్య ఆదేశాల మేరకు మండలంలోని అన్ని గ్రామాల్లో ఈ నెల చివరి వరకు సభ్యత్వ నమోదు పూర్తి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బొమ్మినేని శ్రీదేవి, మార్కెట్ డైరెక్టర్ ఎడ్ల రాజు, టీఆర్ఎస్ జిల్లా నాయకడు పెద్దిరెడ్డి, నాయకులు రాజ్‌కుమార్, ఎల్లమ్మ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- పాక్ క్రికెటర్ అక్మల్‌కు లైన్ క్లియర్..
- మంత్రులతో సీఎం కేసీఆర్ భేటీ
- శీతాకాలం పోతే పెట్రో ధరలు దిగివస్తాయి: పెట్రోలియం మంత్రి
- గవర్నర్ దత్తాత్రేయను తోసిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
- గుజరాత్‌కు కాషాయ పార్టీ చేసిందేమీ లేదు : సూరత్ రోడ్‌షోలో కేజ్రీవాల్
- నల్లటి పెదవులు అందంగా మారాలా? ఇవి ట్రై చేయండి
- కుమార్తె ప్రియుడితో పారిపోయిన తల్లి
- టికెట్ డబ్బులు రిఫండ్ ఇవ్వండి..
- రోడ్ షోలో స్కూటీ నడిపిన స్మృతి ఇరానీ.. వీడియో
- నిర్మల్ పట్టణ అభివృద్ధికి ప్రత్యేక చర్యలు