ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Feb 19, 2021 , 02:48:52

వరికి అగ్గితెగులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

వరికి అగ్గితెగులు సోకకుండా జాగ్రత్తలు తీసుకోవాలి

జనగామ రూరల్‌, ఫిబ్రవరి 18 : భూమిలోని పోషకాలు వరి మొక్కలకు అందక పసుపు రంగులోకి మారి ఎండిపోతున్నాయని మండల వ్యవసాయాధికారి సింగారపు కరుణాకర్‌ అన్నారు. గురువారం మండలంలోని పెద్దపహాడ్‌, గానుగుపహాడ్‌ క్లస్టర్లలోకి పొలాలను పరిశీలించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రత తగ్గడం వల్ల వరిలో ఎదుగుదల లోపించిందన్నారు. రాత్రి వేళల్లో ఉష్ణోగ్రతలు పెరిగితే వరి పైర్లు సాధారణ స్థితికి వస్తాయన్నారు. చలి సమస్యను అధిగమించడానికి పొలంలో సాయంత్రం నీరు పెట్టి ఉదయం తీసివేయాలన్నారు. కార్యక్రమంలో ఏఈవోలు ఊర్మిళ, సౌమ్య,  రైతులు తదితరులు పాల్గొన్నారు. 

పాలకుర్తిలో..

పాలకుర్తి : మండలంలోని ముత్తారం గ్రామం లో అగ్గితెగులు  సోకిన వరి పంటలను పాలకుర్తి డివిజన్‌ వ్యవసాయ సహాయ సంచాలకులు టీ రాధిక  పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మా ట్లాడుతూ.. తెగులు నివారణకు గట్లను శుభ్రంగా ఉంచుకోవాలని, నత్రజని సంబంధిత ఎరువుల వాడకాన్ని తగ్గించాలని రైతులకు సూచించారు. 


VIDEOS

logo