మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Feb 19, 2021 , 02:48:49

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన

టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి విశేష స్పందన

  • స్టేషన్‌ ఘన్‌పూర్‌ నియోజకవర్గ యూత్‌ ఇన్‌చార్జి మాచర్ల గణేశ్‌

స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఫిబ్రవరి 18 : టీఆర్‌ఎస్‌ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి గ్రామాల్లో విశేష స్పందన లభిస్తున్నదని స్టేషన్‌ఘన్‌పూర్‌ నియోజకవర్గ యూత్‌ ఇన్‌చార్జి మాచర్ల గణేశ్‌ అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే డాక్టర్‌ రాజయ్య ఆదేశాల మేరకు గ్రామాల్లో పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టామన్నారు. మొదటి రోజు మండలంలోని చంద్రుతండాలో సర్పంచ్‌, ఎంపీటీసీతో కలసి 110 మందికి సభ్యత్వాలు ఇచ్చామన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ దయ వల్ల మేము పెన్షన్‌ పొందుతున్నామని కొందరు, కల్యాణలక్ష్మి వచ్చిందని మరికొందరు, రైతుబంధుతో పెట్టుబడి కష్టం తీరిందని కొందరు.. ఇలా ప్రజలు స్వచ్ఛందంగా సభ్యత్యం తీసుకోవడానికి ముందుకు వస్తున్నారని గణేశ్‌ తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్‌ భూక్యా రాజు, ఉప సర్పంచ్‌, ఎంపీటీసీ లలిత, శ్రీను, క్లస్టర్‌ ఇన్‌చార్జి చల్లా చందర్‌రెడ్డి, చంద్రు తండా గ్రామ అధ్యక్షుడు హరణ్‌, నాయకులు గణేశ్‌, లక్ష్మణ్‌, విజయ్‌, రవీందర్‌, గోపాల్‌, కిషన్‌, మాలోత్‌ శంకర్‌, మాజీ ఎంపీటీసీ బుజ్జమ్మ, మాజీ సర్పంచ్‌ భూక్యా యాదగిరి, వార్డు సభ్యులు తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo