విద్యార్థులు సందేహాలను నివృత్తి చేసుకోవాలి

రఘునాథపల్లి, ఫిబ్రవరి 18 : విద్యార్థులు తమ సందేహాలను ఎప్పటికప్పుడు నివృత్తి చేసుకుంటే విషయం బోధపడుతుందని రాష్ట్ర మోడల్ స్కూల్స్ అకడమిక్ మానిటరింగ్ అధికారి డాక్టర్ సంజీవ అన్నారు. మండలంలోని వెల్ది మోడల్ స్కూల్‌ను ఆయన గురువారం సందర్శించారు. 9,10 తరగతుల విద్యార్థులకు జరుగుతున్న బోధన తీరును పరిశీలించారు. ప్రతి విద్యార్థిని ప్రత్యేక దృష్టితో చూస్తూ మెరుగైన విద్యను అందించాలని ఉపాధ్యాయులకు సూచించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రంజిత్‌కుమార్, వైస్ ప్రిన్సిపాల్ కృష్ణమూర్తి, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
మోడల్ స్కూల్ తనిఖీ..
నర్మెట : మండల కేంద్రంలోని తెలంగాణ ప్రభుత్వ మోడల్ స్కూల్‌ను రాష్ట్ర అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ పీ సంజీవ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా 9, 10వ తరగతి గదుల్లోకి వెళ్లి విద్యార్థులను పలు ప్రశ్నలు అడిగారు. కొవిడ్ నిబంధనలు పాటిస్తూ చదువుపై శ్రద్ధ వహించాలన్నారు. కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని సూచించారు. పాఠశాలలో కొవిడ్ నిబంధనలు పాటిస్తుండడంతో ఉపాధ్యాయులను అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపల్ ఎస్ అనురాధ, వైస్ ప్రిన్సిపల్ సదానందం, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ఖాదర్‌బాషా దర్గాను సందర్శించిన హోంమంత్రి
- హిందీ జర్నలిస్ట్స్ అసోసియేషన్ డైరీ ఆవిష్కరణ
- యాదాద్రి ఆలయ నిర్మాణ పనుల పరిశీలన
- ఆస్తి పన్ను పెంపు దారుణం : చంద్రబాబు
- స్మృతి మందాన@6
- ‘నాంది’ 11 రోజుల కలెక్షన్స్ ఎంతంటే..
- వామన్‌రావు దంపతుల హత్య బాధ కలిగించింది : కేటీఆర్
- 18 ఏళ్లకే ముద్దు పెట్టేశా.. ఓపెన్ అయిన స్టార్ హీరోయిన్
- కందకుర్తి సరిహద్దులో ఇంజక్షన్ కలకలం
- మార్కాపురంలో ఎన్నికల బహిష్కరణకు టీడీపీ నిర్ణయం.!