గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Feb 19, 2021 , 02:48:49

ప్రతి గడపను తట్టాలి

ప్రతి గడపను తట్టాలి

  •  ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలపై వివరించాలి
  •  ప్రతి ఒక్కరినీ పార్టీలోకి ఆహ్వానించాలి
  • టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదు పండుగలా సాగాలి
  •  తెలంగాణకు టీఆర్‌ఎస్సే శ్రీరామరక్ష
  • మహబూబాబాద్‌ ఎంపీ మాలోతు కవిత
  •  జనగామ నియోజకవర్గంలో సభ్యత్వ నమోదు ప్రారంభం
  • పాల్గొన్న ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

జనగామ, నమస్తే తెలం గాణ, ఫిబ్రవరి 18 : ఊరువాడా తిరిగి ప్రతి గడపను తట్టి సీఎం కేసీఆర్‌ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను వివరించి అన్నివ ర్గాల ప్రజలను ఆహ్వానించిటీఆర్‌ఎస్‌ సభ్యత్వం చేయించాలని మహబూబా బాద్‌ ఎంపీ, జిల్లా ఇన్‌చార్జి మాలోతు కవిత కోరారు. గురువారం జనగామ శివారు లోని ఎస్‌ఆర్‌ గార్డెన్‌లో ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అధ్యక్షతన జనగామ పట్టణం, మండలం, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముందుగా తొలిసభ్యత్వాన్ని ఎమ్మెల్యేకు అందించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణకు టీఆర్‌ఎస్‌ పార్టీయే శ్రీరామరక్ష అని, గులాబీ దళంలో చేరి పనిచేసేందుకు చాలా మంది సిద్ధంగా ఉన్నారని, ప్రతి కార్యకర్త గ్రామాలు, పట్టణాలు, వార్డుల్లో విస్తృతంగా పర్యటించి టీఆర్‌ఎస్‌ సభ్యత్వ నమోదును పండుగలా చేపట్టాలని సూచించారు. జనగామ నియోజకవర్గంలో 50వేల సభ్యత్వాలు లక్ష్యంగా పెట్టుకున్నామని, ఇందులో 17,500 క్రియాశీలక, 32,500 సాధారణ సభ్యులను నమోదు చేయాన్నారు. పార్టీ అప్పగించిన ఈ కార్యాన్ని వారంలోగా పూర్తి చేసేందుకు మున్సిపాలిటీ, మండలాల వారీగా ఇన్‌చార్జిలను నియమించి బాధ్యతలు అప్పగించామన్నారు. కష్టపడి పనిచేసే వారికి తప్పక గుర్తింపు ఉంటుందని చెప్పారు. సభ్యత్వాలతో టీఆర్‌ఎస్‌ను మరింత బలోపేతం చేసి తెలంగాణలో పార్టీని తిరుగులేని శక్తిగా నిలబెట్టాలన్నది అధినేత లక్ష్యమని చెప్పారు. 

ఆంధ్రాపాలకులు సంపదను సృష్టించలేదు : ఎమ్మెల్యే ముత్తిరెడ్డి

ఉమ్మడి రాష్ట్రంలో ఆంధ్రా పాలకులు సంపదను సృష్టించలేదని, దానిని ప్రజలకు పంచలేదని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పేర్కొన్నారు. తెలంగాణలో అమలవుతున్న పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. శిశువు నుంచి వృద్ధుల వరకు సీఎం కేసీఆర్‌ సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ప్రపంచ దేశాలకు దిక్సూచిగా నిలిచారన్నారు. తెలంగాణలో అమలవుతున్నన్ని పథకాలు బీజేపీ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా? అని ప్రశ్నించారు. దేశంలోనే 60లక్షలకు పైగా సభ్యత్వాలు కలిగిన ఏకైక పార్టీ టీఆర్‌ఎస్‌ అని స్పష్టం చేశారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నియోజకవర్గ కో ఆర్డినేటర్‌ డాక్టర్‌ గుజ్జ సంపత్‌రెడ్డి, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, మార్కెట్‌ చైర్‌ పర్సన్‌ బాల్దె విజయ, పట్టణ, మండలాధ్యక్షులు బండ యాదగిరిరెడ్డి, బొడిగం చంద్రారెడ్డి, జగన్మోహన్‌రెడ్డి, నిరేటి సుధాకర్‌, యాదగిరిగౌడ్‌, రైతు బంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, ఎంపీపీలు, జడ్పీటీసీలు తేజావత్‌ గోవర్ధన్‌, మాలతు శ్రీనివాస్‌, జొన్నగోని హరిత, మేకల కళింగరాజు, పీఏసీఎస్‌ చైర్మన్లు మహేందర్‌రెడ్డి, ఉపేందర్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు గద్దల నర్సింగారావు, బాల్దె సిద్ధిలింగం పాల్గొన్నారు.  

VIDEOS

logo