మంగళవారం 09 మార్చి 2021
Jangaon - Feb 18, 2021 , 02:28:32

గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

గ్రామాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలి

స్టేషన్‌ ఘన్‌పూర్‌, ఫిబ్ర వరి 17 : నేరాల నియం త్రణకు గ్రామాల్లో సీసీ కెమె రాలు ఏర్పాటు చేయాల ని జనగామ డీసీపీ శ్రీనివాస్‌ రెడ్డి అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని పోలీ స్‌ స్టేషన్‌ను ఆయన తనిఖీ చేసి రికార్డులు పరిశీలించారు. కరోనా వ్యాక్సిన్‌ సిబ్బందికి ఇచ్చారా అని అడిగి తెలుసుకున్నారు. వైరస్‌ తగ్గినా అప్రమత్తంగా ఉండాలని సూచిం చారు. సంఘ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడే వారిని గుర్తించాలని శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. గ్రామాల్లో అపరిచితులు సంచరిస్తే సీసీ కెమెరాల ద్వారా తెలుసుకుని, ఇందుకనుగుణంగా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఇన్‌చార్జి ఏసీపీ వినోద్‌కుమార్‌, సీఐ శ్రీనివాస్‌ రెడ్డి, ఎస్సైలు రమేశ్‌నాయక్‌, మోహన్‌బాబు పాల్గొన్నారు.


VIDEOS

logo