టీఆర్ఎస్కు కార్యకర్తలే వెన్నుదన్ను

- స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే
- డాక్టర్ తాటికొండ రాజయ్య
- పలు మండలాల్లో సభ్యత్వ నమోదు
జఫర్‌గఢ్, ఫిబ్రవరి 15 : టీఆర్ఎస్కు కార్యకర్తలే వెన్నుదన్ను అని స్టేషన్‌ఘన్‌పూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని గాంధీ సెంటర్లో సోమవారం నిర్వహించిన టీఆర్ఎస్ సభ్యత్వ నమో దు సమావేశానికి పార్టీ మండల అధ్యక్షుడు మహేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా ఆయన మాట్లాడారు. రాజయ్య మాట్లాడుతూ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఆదేశాల మేరకు నియోజకవర్గంలో సభ్యత్వ నమోదును లక్ష్యానికి మించి పూర్తి చేయాలన్నారు. పార్టీ కోసం శ్రమించే కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని ఆయన హామీ ఇచ్చా రు. అనంతరం టీఆర్ఎస్ సభ్యత్వాలను కార్యకర్తలకు అం దజేశారు. ఈకార్యక్రమంలో ఎంపీపీ రడపాక సుదర్శన్, వైస్ ఎంపీపీ కనకయ్య, జడ్పీటీసీ ఇల్లందుల బేబి, పీఏసీఎస్ చైర్మన్ కరుణాకర్‌రావు, వైస్ చైర్మన్ నర్సింగం, జఫర్‌గఢ్ ఎంపీటీసీలు రజిత, స్రవంతి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ శంకర్, టీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్లు గుజ్జరి రాజు, ఇల్లందుల శ్రీనివాస్, అబ్దుల్ సలామ్, పెండ్లి స్వామి తదితరులు పాల్గొన్నారు.
రెట్టింపు ఉత్సాహంతో సభ్యత్వ నమోదు
రఘునాథపల్లి : అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నందున పార్టీ శ్రేణులు రెట్టింపు ఉత్సాహంతో సభ్యత్వ నమోదును పూర్తి చేయాలని స్టేషన్‌ఘన్‌ఫూర్ ఎమ్మెల్యే డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. మండల కేంద్రంలోని ఆర్యవైశ్య భవనంలో సోమవారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టారు. రాజయ్య మాట్లాడుతూ దేశంలో ఎక్కడాలేనివిధంగా తెలంగాణ ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం అమలు చేస్తున్న పథకాలను వివరించి, 15 రోజుల్లో సభ్యుత్వ నమోదు పూర్తి చేయాలని ఆయన నాయకులను కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోకల శివకుమార్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు కుమార్‌గౌడ్, మహిళా విభాగం మండల అధ్యక్షురాలు మడ్లపల్లి సునీత, నాయకులు వారాల రమేశ్, నామాల బుచ్చయ్య, చింత స్వామి, దొనికెల రమాదేవి, కుర్ర కమలాకర్, గుడి రాంరెడ్డి, రేసు కుమార్ తదితరులు పాల్గొన్నారు.
గ్రామాలు గులాబీమయం కావాలి..
లింగాలఘనపురం : దేశంలో ఎక్కడా చేపట్టని అభివృద్ధి, సంక్షేమ పథకాలు తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తున్నారని, ఈ నేపథ్యంలో టీఆర్ఎస్ సభ్యత్వాన్ని పూర్తి చేసి గ్రామాలను గులాబీమయం చేయాలని ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య పిలుపునిచ్చారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్ అధ్యక్షతన సోమవారం మండల కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ మొదటి విడుతగా నియోజక వర్గంలో 50 వేల సభ్యత్వాలు, మండలంలో 7,500 సభ్యత్వాలు పూర్తి చేయాలని కోరారు. అర్హులైన దళిత కుటుంబాలకు రూ.20 లక్షలు లబ్ధి చేకూరేలా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే మొదటి విడుతగా రూ.5 లక్షలతో మినీ డెయిరీ పథకాన్ని అందించారన్నారు. రెండో విడుతలో డబుల్బెడ్రూం ఇళ్లను కేటాయిస్తామన్నారు. మూడో దశలో రూ.10 లక్షల నుంచి రూ. 15 లక్షల వరకు స్వయం ఉపాధి పథకాలకు రుణాలు ఇస్తామని రాజయ్య చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ చిట్ల జయశ్రీఉపేందర్రెడ్డి, జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గంగసాని రంజిత్‌రెడ్డి, వైస్ ఎంపీపీ కిరణ్‌కుమార్, మాజీ వైస్ ఎంపీపీ గవ్వల మల్లేశం, ‘దిశ’ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, సొసైటీ చైర్మన్ మల్గ శ్రీశైలం, ఉపేందర్, నాయకులు బస్వగాని శ్రీనివాస్‌గౌడ్, ఎడ్ల రాజు, ఏదునూరి వీరన్న, నర్సింగ్ రామకృష్ణ, అంతగల్ల రాంచందర్, గండి మంగవ్వయాదగిరి, కాటం విజయకుమార్, శ్వేతపూర్ణచందర్,కేమిడి కవితావెంకటేశ్, ఎలీషా తదితరులు పాల్గొన్నారు.
అభివృద్ధి పనులు పట్టభద్రులకు వివరించాలి : వంశీధర్‌రెడ్డి
దేవరుప్పుల : రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలను పట్టభద్రులకు వివరించి ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ఓటేయాలని ప్రచారం చేయాలని లింగాలఘనపురం జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి అన్నారు. మండలంలోని పొట్టిగుట్ట తండాలోని వానకొండయ్య గుట్ట వద్ద సోమవారం టీఆర్ఎస్ సభ్యత్వ నమోదును ప్రారంభించారు. వంశీధర్‌రెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో ఉద్యోగాల కల్పన, వివిధ రంగాల్లో ఉపాధి కల్పిస్తున్న తీరును నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తీగల దయాకర్, ఎంపీపీ బస్వ సావిత్రి, పీఏసీఎస్ చైర్మన్ లింగాల రమేశ్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్ నర్సింహారెడ్డి, నాయకులు వీరారెడ్డి దామోదర్‌రెడ్డి, పల్లా సుందరరాంరెడ్డి, బస్వ మల్లేశ్, కొల్లూరు సోమయ్య, కోతి ప్రవీణ్, సంజీవరెడ్డి, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ కృష్ణమూర్తి, సొసైటీ వైస్ చైర్మన్ నక్క రమేశ్, సర్పంచ్‌లు బెత్లినారెడ్డి, బిళ్ల అంజమ్మ, శంకర్‌నాయక్, శ్రీనివాస్,రైతుబంధు సమితి గ్రామ కోఆర్డినేటర్లు లీనారెడ్డి, పెద్దారెడ్డి, మహేశ్, హనుమంతు, ఎంపీటీసీ యాఖూ, జలేందర్‌రెడ్డి, ఇంటి మల్లారెడ్డి, గడ్డం రాజు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- గల్ఫ్ ఏజెంట్‌పై కత్తితో దాడి
- సీఎం కేజ్రీవాల్ భద్రతను తగ్గించలేదు: ఢిల్లీ పోలీసులు
- బాలికను వేధించిన ఏడుగురు యువకులపై కేసు నమోదు
- ఓయూ.. వివిధ కోర్సుల పరీక్షా తేదీల ఖరారు
- హైదరాబాద్‌లో అజిత్ సైక్లింగ్..ఫొటోలు వైరల్
- అవినీతి మన వ్యవస్థలో ఒక భాగం: మహారాష్ట్ర డీజీపీ
- గోరు వెచ్చని నీటిని తాగడం వల్ల కలిగే అద్భుతమైన లాభాలివే..!
- నూతన సచివాలయ నిర్మాణ పనుల పరిశీలన
- డబ్ల్యూటీసీలో టీమ్ఇండియా నంబర్‌వన్
- నితిన్ నమ్మకాన్ని చంద్రశేఖర్ యేలేటి నిలబెడతాడా..?