Jangaon
- Feb 15, 2021 , 01:53:43
VIDEOS
కరెన్సీపై అంబేద్కర్ ఫొటో ముద్రించాలి

- ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్
జనగామ నమస్తే తెలంగాణ, ఫిబ్రవరి 14. భారత రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ ఫొటోను కరెన్సీపై ముద్రించాలని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం జనగామ పట్టణంలోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యే తాటికొండ రాజయ్యతో కలిసి ఆయన పూలమాల వేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫోటో ముద్రించడమనేది న్యాయమైన డిమాండ్ అన్నారు. దీనిని స్వాగతిస్తున్నట్లుగా వారు పేర్కొన్నారు. ఈ విషయమై ఆర్బీఐ గవర్నర్తో పాటు ప్రధానమంత్రికి లేఖలు రాస్తామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో దళిత నాయకులు సీహెచ్ రాజమౌళి, సుగుణాకర్ రాజు, కరెన్సీ నోటుపై అంబేద్కర్ ఫొటో సాధన సమితి జాతీయ అధ్యక్షుడు జేరిపోతుల పరశురాములు, నాయకులు రాజు, శేఖర్, ప్రభాకర్, రవి, శ్రీను తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తాం
- అగ్రిహబ్కు నాబార్డ్ 9 కోట్లు
- ఉప ఎన్నికలేవైనా.. గెలుపు టీఆర్ఎస్దే
- ఆదర్శంగా తీర్చిదిద్దుకోవాలి
- కరోనా టీకా తప్పక వేయించుకోవాలి
- వైభవంగా నిర్వహించాలి
- రెన్యూవబుల్ ఎనర్జీలో
- ధర్మపురి ఆలయానికి స్థపతి వల్లినాయగం
- 7న బ్రాహ్మణ పెద్దలతో మంత్రి కేటీఆర్ ఇష్టాగోష్టి
- సినీ హీరోగా సింగరేణి బిడ్డ
MOST READ
TRENDING