సభ్యత్వ నమోదులో ముందుండాలి

స్టేషన్‌ఘన్‌పూర్‌టౌన్, ఫిబ్రవరి 14: టీఆర్ఎస్ సభ్యత్వ నమోదులో స్టేషన్‌ఘన్‌పూర్ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే నంబర్‌వన్‌గా నిలపాలని మహబూబాబాద్ ఎంపీ, పార్టీ సభ్యత్వ నమోదు ఇన్చార్జి మాలోత్ కవిత అన్నారు. మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం ఎమ్మె ల్యే తాటికొండ రాజయ్య అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్ అధికారం చేపట్టాక గ్రామా ల్లో సర్పంచ్‌లకు సముచిత గౌరవం కల్పించారన్నారు. దేశంలో ఎక్కడా అమలు చేయని రీతిలో అభివృద్ధి, సంక్షే మ పథకాలను సీఎం అమలు చేస్తున్నారని కవిత వివరించారు. ఆసరా పింఛన్లతోపాటు పేదింటి ఆడపడుచుల వివాహానికి కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను అమలు చేస్తున్నారని చెప్పారు. అర్హులందరికీ డబుల్‌బెడ్ రూమ్ ఇళ్లు నిర్మించేలా సర్కారు కృషి చేస్తున్నదన్నారు. ఈ నెల 21వ తేదీ వరకు జరిగే సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని కవిత కోరారు. ఈ కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి, జడ్పీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ మారపాక రవి, కుడా డైరెక్టర్ ఆకుల కుమార్, టీఆర్ఎస్ యూత్ నాయకులు గుడి వంశీధర్‌రెడ్డి, పోకల శివకుమార్, రంగు రమేశ్, గట్టు రమేశ్, తోట సత్యం పాల్గొన్నారు.
తాజావార్తలు
- మోదీజీ.. ఇప్పుడేం చెబుతారు? వీడియోలు రిలీజ్ చేసిన కేటీఆర్
- రాష్ట్రంలో ఆడియాలజీ కాలేజీ ఏర్పాటు
- అక్రమంగా తరలిస్తున్న గంజాయి పట్టివేత
- ఏంటి పవన్‌కు నాల్గో భార్యగా వెళ్తావా..నెటిజన్స్ సెటైర్లు..!
- ధోనీ సమావేశంలో తోపులాట, పోలీసుల లాఠీచార్జీ
- పాప చక్కగా పాలు తాగేందుకు.. ఓ తండ్రి కొత్త టెక్నిక్
- ఎన్‌పీఎస్‌లో పాక్షిక విత్‌డ్రాయల్స్ కోసం ఏం చేయాలంటే..?!
- జనగామ జిల్లాలో బాలిక అదృశ్యం
- టీఆర్ఎస్, బీజేపీ పాలనలోని వ్యత్యాసాలను వివరించండి
- రానా 'అరణ్య' ట్రైలర్ వచ్చేసింది