శనివారం 06 మార్చి 2021
Jangaon - Feb 15, 2021 , 01:53:45

అమర సైనికులకు యువజన సంఘాల నివాళి

అమర సైనికులకు యువజన సంఘాల నివాళి

దేవరుప్పుల, ఫిబ్రవరి 14 : పుల్వామా ఉగ్రదాడిలో అమరులైన భారత సైనికులకు యువజన సంఘాల సభ్యులు ఆదివారం ఘనంగా నివాళులర్పించారు. మండలంలోని పెద్దమడూరులో ఆదర్శ యువజన మండలి అధ్యక్షుడు చంద్రగిరి సంపత్‌ నేతృత్వంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పలువురు మాట్లాడుతూ దేశ రక్షణకు రేయింబవళ్లు శ్రమిస్తున్న సైనికుల త్యాగాలు వెలకట్టలేనివన్నారు. పాకిస్తాన్‌ కుయుక్తులను తిప్పికొడుతున్న సైనికుల కు అండగా ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆ దర్శ యువజన మండలి కార్యదర్శి బింగి ప్రశాంత్‌, కన్వీనర్‌ మానుపాటి ఉపేందర్‌. కోశాధికారి దేవర సోమన్న, గొడిశాల బాలరాజు, కారుపోతుల శ్రీనివాస్‌, గొరిపల్లి సంపత్‌, కొండ మహేశ్‌, ముత్యాల నరేశ్‌, గొడిశాల రంజిత్‌, ప్రదీప్‌ పాల్గొన్నారు.

లింగాలఘనపురంలో..

లింగాలఘనపురం : మండలంలోని గుమ్మడవెళ్లిలో యూత్‌ సభ్యులు అమర జవాన్లకు నివాళులర్పించారు. ఆదివారం స్థానిక సర్పంచ్‌ కత్తుల శ్రీపాల్‌రెడ్డి అధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ పాకిస్తాన్‌ దురాగతాలను అడ్డుకుంటూ దేశరక్షణకు పాటుపడుతున్న సైనికుల త్యాగాలు మరువలేనివన్నారు.

VIDEOS

logo