సోమవారం 01 మార్చి 2021
Jangaon - Feb 14, 2021 , 02:03:40

దాతలు ముందుకు వస్తే మరింత అభివృద్ధి

దాతలు ముందుకు వస్తే మరింత అభివృద్ధి

బచ్చన్నపేట, ఫిబ్రవరి13: తెలంగాణ శైవ క్షేత్రాల్లో ఒకటైన కొడవటూరు సిద్ధేశ్వరస్వామి ఆలయ పరిధిలో నిర్మించిన ఆర్యవైశ్య సత్రం మరింత అభివృద్ధి చెందాలంటే దాతలు ముందుకు రావాలని హైదరాబాద్‌ ఆర్‌ఎస్‌ బ్రదర్స్‌ ప్రతినిధులు శీర్న రాములుగుప్తా, రాజమౌళి గుప్తా, జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున లింగయ్య అన్నారు. గ్రామంలో ఆర్యవైశ్య సత్రంలో నిర్మించిన  నాలుగు ఏసీ గదులను శనివారం వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సిద్ధులగుట్టలో నిర్మించిన ఆర్యవైశ్య సత్రంలో నాలుగు ఏసీ గదులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందుగా సత్రంలో  వాసవికన్యకా పరమేశ్వరికి పూజలు నిర్వహించారు. అనంతరం అన్నదానం చేశారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం రాష్ట్ర అధ్యక్షుడు  గంప శ్రీనివాస్‌, సంఘం సభ్యులు పాల్గొన్నారు. అనంతరం దాతలతోపాటు మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జమున దంపతులను సన్మానించారు.

VIDEOS

logo