శనివారం 06 మార్చి 2021
Jangaon - Feb 14, 2021 , 02:03:40

20 లోగా వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేయాలి

20 లోగా వైకుంఠధామాల నిర్మాణం పూర్తి చేయాలి

  • కలెక్టర్‌ నిఖిల

జనగామ చౌరస్తా, ఫిబ్రవరి13: ఈనెల 20లోగా వైకుంఠధామాల నిర్మాణాలు పూర్తి చేయాలని కలెక్టర్‌ కే నిఖిల అన్నారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వైకుంఠధామాల నిర్మాణం, ఎఫ్టీవోల నమోదు, నర్సరీలు, గ్రీన్‌ చాలెంజ్‌, ఉపాధి హామీ పనులపై అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలోని కొన్ని గ్రామ పంచాయతీల్లో వైకుంఠధామాలకు సంబంధించి చిన్నచిన్న పనులు మిగిలి ఉన్నాయని, వాటన్నింటినీ ఈనెల 20లోగా పూర్తి చేయాలని ఆదేశించారు. గ్రామాల్లో తాగునీటి సరఫరాపై అధికారులు దృష్టి పెట్టాలన్నారు. మిషన్‌ భగీరథ నీటి సరఫరాకు అవకాశం ఉన్న చోట్ల ఏర్పాట్లు చేయాలని, నీటి సరఫరాకు అవకాశం లేనిచోట బోర్లు వేసే విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు. నర్సరీల్లో వంద శాతం బ్యాగ్‌ ఫిల్లింగ్‌, సీడ్‌ డబ్లింగ్‌ ప్రక్రియ పూర్తి చేసినట్లు పేర్కొన్నారు. ఉపాధి హామీ కూలీల సంఖ్య పెంచాలన్నారు. మస్టర్ల వివరాలు ఎప్పటికప్పుడు అప్‌డేట్‌ చేయాలన్నారు. క్షేత్ర స్థాయిలో పరిశీలించి పంట కల్లాలు నిర్మించుకుంటున్న వారి పేర్లు ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని చెప్పారు. ఈనెల 17న నిర్వహించన్ను గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌ కార్యక్రమం విజయవంతానికి చర్యలు చేపట్టాలన్నారు. మొక్కలు నాటేందుకు ఆదివారంలోగా గుంతల తవ్వడం పూర్తి చేయాలన్నారు. పంచాయతీ కార్యదర్శులకు రిజిస్టర్లు, వర్క్‌ సైట్‌ ఫైళ్ల నిర్వహణపై అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, డీఆర్డీవో రాంరెడ్డి, జడ్పీ సీఈవో రమాదేవి, డీపీవో రంగాచారి, మండల ప్రత్యేకాధికారులు, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఈసీలు, టీఏలు తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo