Jangaon
- Feb 13, 2021 , 00:32:01
VIDEOS
పాకాలలో జిల్లా స్థాయి కబడ్డీ పోటీలు ప్రారంభం

కొడకండ్ల, ఫిబ్రవరి 12 : మండలంలోని పాకాల గ్రామంలో వారం రోజుల పాటు నిర్వహించే జిల్లా స్థాయి కబడ్డీ పోటీలను డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి శుక్రవారం ప్రారంభించారు. అనంతరం సర్పంచ్ జాజుల శ్రీలేఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పసునూరి మ ధుసూదన్ పాల్గొన్నారు. అంతకు ముందు క్రీడాకారులతో కలిసి ఆయన కబడ్డీ ఆడా రు. జిల్లా నలుమూలల నుంచి 25 జట్లు పోటీల్లో పాల్గొంటున్నాయని క్రీడల నిర్వాహకులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ‘మిషన్ భగీరథ’ ఏఈ జాజుల ప్రవీణ్, బోయిని రమేశ్, కుంచం హరీశ్, నిర్వాహకులు అనపురం మధు, తాళ్ల శోభన్, దేశబోయిన అయిలుమల్లు పాల్గొన్నారు.
తాజావార్తలు
- నితిన్ వైపు పరుగెత్తుకొచ్చి కిందపడ్డ ప్రియావారియర్..వీడియో
- పార్వో వైరస్ కలకలం.. 8 కుక్కలు మరణం
- అక్రమంగా నిల్వ చేసిన కలప స్వాధీనం
- గోవధ ఘటనపై మంత్రి హరీశ్‌రావు ఆగ్రహం
- చిరంజీవి అభిమానికి బాలకృష్ణ అభిమాని సాయం
- మార్చి 8 నుంచి 16 వరకు శ్రీ కేతకీ సంగమేశ్వరస్వామి జాతర
- అక్రమ దందాలకు పాల్పడుతున్న విలేకర్ల అరెస్టు
- డిక్కీ నేతృత్వంలో డా. ఎర్రోళ్ల శ్రీనివాస్‌కు ఘన సన్మానం
- 'విజయ్ 65' వర్కవుట్ అవ్వాలని ఆశిస్తున్నా: పూజాహెగ్డే
- దేశీయ విమానయానం ఇక చౌక.. ఎలాగంటే!
MOST READ
TRENDING