శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Feb 12, 2021 , 02:04:53

రెండో విడుత కరోనా టీకాకు ఏర్పాట్లు పూర్తి

రెండో విడుత కరోనా టీకాకు ఏర్పాట్లు పూర్తి

  • కలెక్టర్‌ నిఖిల

జనగామ చౌరస్తా, ఫిబ్రవరి 11: ఈనెల 13 నుంచి 28 వరకు రెండో విడుత కరోనా టీకా పంపిణీకి ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కలెక్టర్‌ కే నిఖిల తెలిపారు. గురువారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో కరోనా టీకా రెండో విడుత టీకాలపై జిల్లా స్థాయి టాస్క్‌ఫోర్స్‌ కమిటీ సమావేశాన్ని కలెక్టర్‌ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ.. మొదటి విడుతలో టీకా వేసుకోవడానికి జిల్లా వ్యాప్తంగా 5,950 మంది ఆన్‌లైన్‌లో పేర్లు నమోదు చేసుకోగా 2,441 మంది టీకా తీసుకున్నట్లు తెలిపారు. మొదటి విడుతలో టీకా తీసుకున్నవారంతా ఆరోగ్యంగా ఉన్నట్లు కలెక్టర్‌ తెలిపారు. కరోనా టీకాతో దుష్ప్రభావాలు లేవని, నిర్భయంగా టీకా తీసుకోవచ్చని ఆమె అన్నారు. మొదటి విడుత టీకా తీసుకున్నవారంతా రెండో విడుత తప్పనిసరిగా తీసుకోవాలని అన్నారు. సమావేశంతో జిల్లా వైద్యాధికారి మహేందర్‌, మున్సిపల్‌ కమిషనర్‌ సమ్మయ్య, జిల్లా ఉప వైద్యాధికారి కరుణాశ్రీ, సర్కిల్‌ ఇన్‌స్పెక్టర్‌ మల్లేశం, వైద్యాధికారులు రాము, జయపాల్‌రెడ్డి, రాజశేఖర్‌ తదితరులు పాల్గొన్నారు.

బాలల హక్కుల పరిరక్షణకు చర్యలు చేపట్టాలి

బాలల హక్కుల పరిరక్షణకు అధికారులు చర్యలు చేపట్టాలని కలెక్టర్‌ నిఖిల అన్నారు. గురువారం కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో బాలల హక్కుల పరిరక్షణకు చేపట్టాల్సిన చర్యలపై సంబంధిత అధికారులతో కలెక్టర్‌ సమీక్ష నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ జిల్లాలో బాల కార్మికులను గుర్తించి యజమానులపై చర్యలు తీసుకోవాలన్నారు. ఇప్పటి వరకు జిల్లాలో 100 బాల్య వివాహాలను నిరోధించామన్నారు. బాలల హక్కుల పరిరక్షణకు మండల స్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల పనితీరు మెరుగుపర్చి పోషక ఆహార పదార్థాలు బాలలకు అందించాలన్నారు. సమావేశంతో అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, బాలల హక్కుల పరిరక్షణ సమితి ఉమ్మడి వరంగల్‌ జిల్లా అధ్యక్షుడు మండల పరశురాములు, జిల్లా సంక్షేమాధికారి జయంతి, జిల్లా విద్యాశాఖాధికారి యాదయ్య, జిల్లా బాలల సంరక్షణ అధికారి రవికాంత్‌, జిల్లా కార్మిక అధికారి చాణక్య, జనగామ అర్బన్‌ సీఐ డీ.మల్లేశ్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు. 

పుష్పగుచ్ఛం అందజేత

కలెక్టర్‌ నిఖిలతోపాటు వెస్ట్‌ జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డికి వేర్వేరు కార్యక్రమాల్లో జిల్లా బాలల సంక్షేమాధికారి జయంతి పుష్పగుచ్ఛాన్ని అందజేశారు. బాలల హక్కుల పరిరక్షణకు తీసుకోవాల్సిన చర్యలపై కలెక్టర్‌, డీసీపీతో చర్చించినట్లు సంక్షేమాధికారి తెలిపారు. కార్యక్రమంలో చైల్డ్‌ వెల్ఫేర్‌ కమిటీ చైర్‌పర్సన్‌ ఉప్పలయ్య, సభ్యులు కవిత, డీసీపీవో రవికాంత్‌ తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo