శనివారం 06 మార్చి 2021
Jangaon - Feb 12, 2021 , 02:04:55

ముగిసిన కేసీఆర్‌ కప్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌

ముగిసిన కేసీఆర్‌ కప్‌ వాలీబాల్‌ టోర్నమెంట్‌

జనగామ టౌన్‌, ఫిబ్రవరి11: పట్టణంలోని ధర్మకంచ మినీస్టేడియంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి కేసీఆర్‌ కప్‌ 2021 వాలీబాల్‌ టోర్నమెంట్‌ గురువారం ముగిసినట్లు జాగృతి జనగామ జిల్లా అధ్యక్షుడు పసునూరి మురళి తెలిపారు. జఫర్‌గఢ్‌ మండలం హిమ్మత్‌నగర్‌ జట్లు ప్రథమ స్థానంలో నిలవగా రూ.20 వేల చెక్కు, స్టేషన్‌ ఘన్‌పూర్‌ మండలం ఇప్పగూడెం టీమ్‌ ద్వితీయ స్థానంలో నిలువగా రూ.10 వేల చెక్కును బహూకరించినట్లు  తెలిపారు. రాష్ట్ర స్థాయి కేసీఆర్‌ కప్‌ 2021ను జిల్లా క్రీడాకారులు సొంతం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీవైఎస్‌వో గోపాల్‌రావ్‌, వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కాల యాదిరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ మహ్మద్‌ కుద్దూస్‌, జాగృతి విద్యార్థి విభాగం జిల్లా  అధ్యక్షుడు గంగాధర్‌, యూత్‌ విభాగం రవిచంద్ర, రాజు, వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరేండ్ల శ్రీధర్‌, సంపత్‌ రెడ్డి, వేమళ్ల సుమన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo