బుధవారం 24 ఫిబ్రవరి 2021
Jangaon - Feb 12, 2021 , 02:04:55

ఘనంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జన్మదిన వేడుకలు

ఘనంగా ఎమ్మెల్యే ముత్తిరెడ్డి జన్మదిన వేడుకలు

జనగామటౌన్‌/నర్మెట/జనగామరూరల్‌/ బచ్చన్నపేట/ తరిగొప్పుల(నర్మెట)/ ఫిబ్రవరి 11: ప్రకృతి ప్రేమికుడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి జన్మదిన వేడుకలను జనగామ, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల మండలాల్లో గురువారం ఘనంగా నిర్వహించారు. జనగామ మున్సిపల్‌ చైర్మన్‌ జమున పట్టణంలో వైస్‌ చైర్మన్‌ రాంప్రసాద్‌, కౌన్సిలర్లు, నాయకులు మొక్కలు నాటారు. బచ్చన్నపేటలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు రమణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు చెంద్రారెడ్డి కేక్‌కట్‌ చేసి పంపిణీ చేశారు. బచ్చన్నపేట సర్పంచ్‌ మల్లారెడ్డి, ఉప సర్పంచ్‌ హరికృష్ణ ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. వంగ సుదర్శన్‌రెడ్డి నగర్‌లో సర్పంచ్‌ స్వామి శ్రమదానం చేసి మొక్కలు నాటారు.  తరిగొప్పులలో నాయకులు కేక్‌ కట్‌చేసి, మొక్కలునాటారు. జీపీ కార్మికులకు పండ్లు పంపిణీ చేశారు. నర్మెటలో టీఆర్‌ఎస్‌ నాయకులు కేక్‌ కట్‌ చేసి పంచిపెట్టారు. అనాథ ఆశ్రమంలో నిత్యావసర వస్తువులను అందించారు. ఎంపీడీవో కార్యాలయ ఆవరణంలో మొక్కలు నాటారు. జనగామ మండలం పెంబర్తిలో జనగామ మార్కెట్‌ కమిటీ చైర్‌పర్సన్‌ విజయసిద్దిలింగం ఆధ్వర్యంలో మొక్కలు నాటారు. వ్యవసాయ కూలీలతో కేక్‌ కట్‌ చేశారు. శామీర్‌పేటలో ఎంపీపీ కలింగరాజు, మండల సర్పంచ్‌ల ఫోరం అధ్యక్షురాలు శారద వడ్లకొండలో కేక్‌కట్‌ చేశారు. చీటాకోడూర్‌ రిజర్వాయర్‌ వద్ద మైసమ్మకు పూజలు నిర్వహించారు. గానుగుపహాడ్‌లో సర్పంచ్‌ శ్రీనివాస్‌, పెంబర్తిలో జడ్పీటీసీ దీపిక, ఉప సర్పంచ్‌ రేఖ, చౌడారంలో సర్పంచ్‌ రాజయ్య మొక్కలు నాటారు.

VIDEOS

logo