మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Feb 11, 2021 , 02:21:30

మానసికోల్లాసానికి క్రీడలు దోహదం

మానసికోల్లాసానికి క్రీడలు దోహదం

  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

జనగామ టౌన్‌, ఫిబ్రవరి 10 : మానసికోల్లాసానికి క్రీడలు దోహదపడుతాయని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. పట్టణంలోని ధర్మకంచ మినీస్టేడియంలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న ‘కేసీఆర్‌ కప్‌-2021’ వాలీబాల్‌ టోర్నమెంట్‌ను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డి మా ట్లాడుతూ యువత క్రీడల్లో ఆసక్తి చూపాలన్నారు. పర్యావరణాన్ని పరిరక్షించేందుకు మొక్కలు నాటి వాతావరణ కాలుష్యాన్ని నివారించాలని సూచించారు. కేసీఆర్‌ జన్మదినం సందర్భంగా నిర్వహిస్తున్న  జిల్లా స్థాయి వాలీబాల్‌ పోటీల్లో గెలిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక కావాలని ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కోరారు. ఈ కార్యక్రమంలో జనగామ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పోకల జమున, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షుడు పోకల లింగయ్య, డీవైఎస్‌వో గోపాల్‌రావు, వాలీబాల్‌ అసోసియేషన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి మర్కాల యాదిరెడ్డి, జాయింట్‌ సెక్రటరీ మహ్మద్‌ కుద్దూస్‌, జాగృతి విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు గంగాధర్‌, యువజన విభాగంగా నాయకులు రవిచంద్ర, రాజు, వాలీబాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు నరెడ్ల శ్రీధర్‌, సంపత్‌ రెడ్డి, వేమళ్ల సుమన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo