శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Feb 11, 2021 , 02:21:33

రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం : రాజయ్య

రైతును రాజును చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం : రాజయ్య

జఫర్‌గఢ్‌, ఫిబ్రవరి 10 : రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని ఉప్పుగల్లు, తీగారం, తమ్మడపల్లి(జీ), జఫర్‌గఢ్‌, కూనూరు క్లస్టర్‌ గ్రామాల్లో నిర్మించిన రైతువేదికల భవనాలను బుధవారం ఆయన ప్రారంభించారు.  ఈ సందర్భంగా నిర్వహించిన సమావేశాల్లో రాజయ్య మాట్లాడుతూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి రైతుల సంక్షేమానికి అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. రైతుబంధు పథకంతో ఎకరాకు ఏడాదిలో రూ.10 వేలతో పాటు ఉచితంగా నిరంతర విద్యుత్‌ ఇస్తున్నారని ఆయన చెప్పారు. వ్యవసాయ రంగాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం కేసీఆర్‌ అనేక కార్యక్రమాలు అమలు చేస్తున్నారని రాజయ్య చెప్పారు. 

వాటర్‌ ట్యాంక్‌ పనులకు శంకుస్థాపన...

ఉప్పుగల్లులో రూ.38 లక్షల వ్యయంతో నిర్మించే వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి, రూ.56 లక్షల వ్యయంతో ఏర్పాటు చేస్తున్న పైపులైన్‌ పనులకు ఎమ్మెల్యే రాజయ్య శంకుస్థాపన చేశారు. ఉప్పుగల్లులో సెర్ఫ్‌ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన జనరల్‌ స్టోర్‌ను ఆయన ప్రారంభించారు. ఈ కార్యక్రమాల్లో ఎంపీపీ రడపాక సుదర్శన్‌, వైస్‌ ఎంపీపీ కనకయ్య, జడ్పీటీసీ ఇల్లందుల బేబి, పీఏసీఎస్‌ చైర్మన్‌ కరుణాకర్‌రావు, రైతుబంధు సమితి మండల కోఆర్డినేటర్‌ శంకర్‌, ఎంపీడీవో శ్రీధర్‌స్వామి, సర్పంచ్‌లు గాదెపాక సువర్ణ, జయపాల్‌రెడ్డి, అన్నెపు పద్మ, ఇల్లందుల కుమార్‌, టీఆర్‌ఎస్‌ మండలాధ్యక్షుడు మహేందర్‌రెడ్డి, జిల్లా నాయకులు గుజ్జరి రాజు, ఇల్లందుల శ్రీనివాస్‌ తదితరులు 


VIDEOS

logo