శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Feb 11, 2021 , 02:21:33

పార్టీ కోసం కష్టపడేవారిని ఆదుకుంటాం : ముత్తిరెడ్డి

పార్టీ కోసం కష్టపడేవారిని ఆదుకుంటాం : ముత్తిరెడ్డి

జనగామ టౌన్‌, ఫిబ్రవరి 10 : పార్టీ కోసం కష్టపడిన వారిని కంటికి రెప్పలా కాపాడుకుంటామని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలోని క్యాంపు కార్యాలయంలో ఇటీవల వేర్వేరు కారణాలతో మృతి చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తల కుటుంబాలకు బీమా చెక్కులను ఆయన అందజేశారు. జనగామ నియోజకవర్గం ధూలిమిట్ట మండల కేంద్రానికి చెందిన కరుణాకర్‌ ఇటీవల విద్యుత్‌ షాక్‌తో మరణించగా మృతుడి భార్య దివ్యకు రూ. 2 లక్షల బీమా చెక్కును అందజేశారు. ముత్తిరెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలే పార్టీకి పట్టుగొమ్మలని, కార్యకర్తల సంక్షేమమే టీఆర్‌ఎస్‌ లక్ష్యమన్నారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, టీఆర్‌ఎస్‌ మద్దూరు మండల అధ్యక్షుడు మంద యాదగిరి, పీఏసీఎస్‌ చైర్మన్‌ తిరుపతి రెడ్డి, ధూలిమిట్ట సర్పంచ్‌ వేణుగోపాల్‌ రెడ్డి, మాజీ సర్పంచ్‌ లక్ష్మయ్య తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo