గురువారం 25 ఫిబ్రవరి 2021
Jangaon - Feb 09, 2021 , 01:43:56

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

  • ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య

లింగాలఘనపుం, ఫిబ్రవరి 8 : రైతు సంక్షేమమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య అన్నారు. మండలంలోని సిరిపురం, బండ్లగూడెం, వనపర్తి, కుందారం గ్రామాల్లో నిర్మించిన రైతువేదిక భవనాలను సోమవారం ఆయన ప్రారంభించారు. లింగాలఘనపురంలో నిర్మించే 40 వేల లీటర్ల సామర్థ్యం గల ఓహెచ్‌ఎస్‌ఆర్‌ ట్యాంకు, రెడ్డిపురంలో 20 వేల లీటర్ల సామర్థ్యంగల ట్యాంకుకు రాజయ్య శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ కరో నా కష్టకాలంలోనూ సీఎం కేసీఆర్‌ గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయించారని గుర్తు చేశారు. నాణ్యమైన విద్యుత్‌ను 24 గంటలు రైతులకు అందిస్తున్నారన్నారు.  పంట పెట్టుబడి ఇస్తున్నారని తెలిపారు. వచ్చే బడ్జెట్‌లో రుణమాఫీకి నిధులు కేటాయిస్తారని ఆయన పేర్కొన్నారు. ఈ కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్‌ పాగాల సంపత్‌రెడ్డి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు ఇర్రి రమణారెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ, జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, మాజీ జడ్పీటీసీ గంగసాని రంజిత్‌రెడ్డి, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు వంచ మనోహర్‌రెడ్డి, మండల కోఆర్డినేటర్‌ బస్వగాని శ్రీనివాస్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు బొల్లంపెల్లి నాగేందర్‌, మార్కెట్‌ కమిటీ వైస్‌ చైర్మన్‌ ఆగారెడ్డి, సొసైటీ అధ్యక్షుడు మల్గ శ్రీశైలం, ఉపేందర్‌, ‘దిశ’ సభ్యురాలు ఉడుగుల భాగ్యలక్ష్మి, సర్పంచ్‌లు దూసరి గణపతి,  లక్ష్మి, కాటం విజ య, విజయమనోహర్‌, ఉంగరాల శ్రీధర్‌, చౌదరపెల్లి శ్వేతాపూర్ణచందర్‌, చాడ సుగుణ, ఎంపీటీసీలు మాదవి, కేమిడి భిక్షపతి, గోలి రాజు, రజిత, ఎంపీడీవో సురేందర్‌, ఎంపీవో మల్లికార్జున్‌, ఏవో జయంత్‌కుమార్‌, ఏఈవోలు రచన, భరత్‌, సుమన్‌, అపూర్వ పాల్గొన్నారు.     


VIDEOS

logo