శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Jangaon - Feb 09, 2021 , 01:43:58

అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయం

అభివృద్ధి, సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయం

పాలకుర్తి, ఫిబ్రవరి 8 : అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే తెలంగాణ నంబర్‌వన్‌ స్థానంలో ఉందని ఎమ్మెల్సీ ఎన్నికల పాలకుర్తి నియోజకవర్గ ఇన్‌చార్జి జన్ను జకార్య అన్నారు. సోమవారం మండల కేంద్రంలోని టీఆర్‌ఎస్‌ కార్యాలయంలో పార్టీ మండల అధ్యక్షుడు పసునూరి నవీన్‌కుమార్‌ అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో ఎంపీపీ నల్లా నాగిరెడ్డి, ఎఫ్‌ఎస్‌సీఎస్‌ చైర్మన్‌ బొబ్బల అశోక్‌రెడ్డి పాల్గొన్నారు. జకార్య మాట్లాడుతూ ఈనెల 12న నియోజవకవర్గ కేందమైన పాలకుర్తిలో పాలకుర్తి, కొడకండ్ల, దేవరుప్పుల, మండలాలకు చెందిన టీఆర్‌ఎస్‌ కార్యకర్తలతో పార్టీ సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనికి పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు, రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి హాజరవుతున్నట్లు తెలిపారు. పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ బలపర్చిన ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. ఈ సమావేశంలో పాలకుర్తి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ ముస్కు రాంబాబు, బాలూనాయక్‌, పోశాల వెంకన్న, పసులాది వెంకటేశ్‌, పాపారావు, మల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.

VIDEOS

logo