ప్రతిపల్లె పరిశుభ్రంగా ఉండాలి : జడ్పీ డిప్యూటీ సీఈవో

బచ్చన్నపేట, ఫిబ్రవరి 8 : మండలంలోని ప్రతిపల్లె పరిశుభ్రంగా ఉండాలని, పచ్చని చెట్లతో కళకళలాడేలా చూడాలని జడ్పీ డిప్యూటీ సీఈవో వసంత అన్నారు. సోమవారం మండలంలోని బోనకొల్లూరులో పల్లెప్రగతి అభివృద్ధి పనులను ఆమె పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నదన్నారు. ప్రతి గ్రామానికి శ్మశానవాటిక, నర్సరీ, పల్లెప్రకృతి వనం, చెత్త తరలించేందుకు డంపింగ్‌యార్డు మంజూరు చేసి పనులు పూర్తి చేయించేందుకు చర్యలు తీసుకుందన్నారు. ఈ నేపథ్యంలో సర్పంచ్‌లు, పంచాయతీ కార్యదర్శులు అభివృద్ధి పనుల పూర్తికి తమవంతు కృషి చేయాలని ఆమె కోరారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ మీస అయిలుమల్లు, పంచాయతీ కార్యదర్శి సతీశ్‌రెడ్డి, వార్డు సభ్యులు పాల్గొన్నారు.
పల్లెప్రగతి పనుల్లో వేగం పెంచాలి
పాలకుర్తి రూరల్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లెప్రగతి పనుల్లో వేగం పెంచాలని ఎంపీపీ నల్లా నాగిరెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని విస్నూరులో పెండింగ్ పనుల బిల్లుల విడుదల కోసం ఏర్పాటు చేసిన గ్రామసభకు సర్పంచ్ నకీర్త యాకయ్య అధ్యక్షత వహించారు. ఎంపీపీ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు గ్రామాల్లో జరిగిన పనులకు నిధులు విడుదల చేస్తున్నామన్నారు. తక్షణమే సర్పంచ్‌లు పంచాయతీ కార్యదర్శులు పనుల నివేదికలను సమర్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో వనపర్తి అశోక్‌కుమార్, పీఆర్ ఏఈ పాషా, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ప్రశాంతి, ఎంపీవో దయాకర్, ఏపీవో అంబాల మంజుల, ఎంపీటీసీ నకీర్త యాకయ్య, ఉప సర్పంచ్ ఐలినేని సోమేశ్వర్రావు, ఎర్రబెల్లి రాఘవరావు, దొంతరబోయిన వెంకటేశ్వర్రావు, రాపాక ప్రేమ్ కుమార్‌రెడ్డి, బండి వనజ, ఏపీఎం రమణాచారి, అల్లమనేని రమేశ్‌రావు వార్డు సభ్యులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- ప్రైవేటు రంగంలో స్థానిక రిజర్వేషన్ల బిల్లుకు గవర్నర్ ఆమోదం
- కొవిడ్-19 సర్టిఫికెట్‌పై ప్రధాని ఫోటో ప్రచార ఎత్తుగడే : తృణమూల్ కాంగ్రెస్
- ఏపీలో మళ్లీ పెరిగిన కరోనా కేసులు
- చివరి టెస్టుకు నెట్స్‌లో భారత ఆటగాళ్ల ప్రాక్టీస్
- టాప్-10 బిలియనీర్లలో మళ్లీ ముకేశ్
- వీడియో : ప్రాణాపాయ స్థితిలో ఉన్న వ్యక్తిని కాపాడిన ఎమ్మెల్యే
- అంగన్ వాడీల సమస్యలన్నీ పరిష్కరిస్తాం
- బెంగాల్లో అరాచక వాతావరణం కనిపిస్తోంది : యూపీ సీఎం
- అడవి జంతువుల కట్టడికి కమిటీ ఏర్పాటు
- పవన్‌తో సాయిపల్లవి సినిమా చేయడం లేదా..?