మంగళవారం 02 మార్చి 2021
Jangaon - Feb 08, 2021 , 01:18:11

కారును ఢీకొన్న వాటర్‌ ట్యాంకర్‌

కారును ఢీకొన్న వాటర్‌ ట్యాంకర్‌

  • ముగ్గురికి స్వల్ప గాయాలు గోవర్ధనగిరి వద్ద ఘటన

 రఘునాథపల్లి, ఫిబ్రవరి 7: హైదరాబాద్‌-వరంగల్‌ జాతీయ రహదారిపై మండలంలోని గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఆదివారం కారును వాటర్‌ ట్యాంకర్‌ ఢీకొంది. స్థానికుల కథనం ప్రకారం.. జనగామ నుంచి ఓ కారు హన్మకొండకు వెళ్తుండగా గోవర్ధనగిరి దర్గా సమీపంలో వాటర్‌ ట్యాంకర్‌ వేగంగా వస్తూ ఢీకొంది. ఈ ఘటనలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయింది. కారులో ప్రయాణిస్తున్న మహిళ, యువకుడు, చిన్నారి స్వల్ప గాయాలతో బయటపడ్డారు.ప్రమాదంలో ఎవరికీ ప్రాణహాని జరుగకపోవడంతో స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. ఇదిలా ఉండగా హైవే పై వాహనదారులు అతివేగంగా వెళ్తుండడంతో ప్ర మాదాలు జరుగుతున్నాయని పలువురు అభిప్రా యపడుతున్నారు. దీనిని నివారించేందుకు పోలీ సులు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.

VIDEOS

logo