ఆదివారం 28 ఫిబ్రవరి 2021
Jangaon - Feb 08, 2021 , 01:18:13

కవితను కలిసిన పెంబర్తి హస్తకళాకారులు

కవితను కలిసిన పెంబర్తి హస్తకళాకారులు

  • యాదాద్రి ఆలయంలో పనులు కల్పించడంపై హర్షం

జనగామ రూరల్‌, ఫిబ్రవరి 7: జనగామ మండలం పెంబర్తికి చెం దిన హస్తకళాకారులు ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను కలిశారు. యాదాద్రిలోని లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానంలో ఇత్తడి, వెండి పనులకు విశ్వకర్మ సంఘం ఇచ్చిన కొటేషన్‌కు యాదాద్రి కమిటీ పలు అభ్యంతరాలు తెలుపడంతో  సమస్యను కవితకు వివరించారు. తక్కువ ధరలకు పనులు చేస్తామని చెప్పారు. పొరుగు రాష్ర్టాల నుంచి వచ్చిన కళాకారులతో కాకుండా పెంబర్తి కళాకారులకు పనులు అప్పగించేలా ఎమ్మె ల్సీ కవిత అగ్రిమెంట్‌ చేయించినందుకు విశ్వకర్మ సొసైటీ, హస్తకళాకారుల సంక్షేమ సంఘం తరుఫున హర్షం వ్యక్తం చేస్తూ ఆమెకు ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ జాగృతి జిల్లా మహిళా అధ్యక్షురాలు పానుగంటి మంజుల, హస్తకళాకారులు లక్ష్మణాచారి, వేదాంతాచారి, కూ రోజు రాజు, శ్రీనివాసాచారి, నరసింహాచారి తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo