‘డబుల్ ఇండ్లు’ భేష్

- కితాబునిచ్చిన కేంద్ర బృందం జనగామలో ఇళ్ల పరిశీలన
జనగామ చౌరస్తా, ఫిబ్రవరి6 : రాష్ట్ర ప్రభు త్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డబుల్ బెడ్రూ మ్ ఇండ్లు బాగున్నాయంటూ కేంద్రం బృందం కితాబునిచ్చింది. జిల్లాకేంద్రంలోని బాణాపురం సమీపంలో నిర్మిస్తున్న 760 డబుల్ బెడ్ రూం (2బీహెచ్‌కే) ఇండ్లను శనివారం కేంద్ర గృహ నిర్మాణ మంత్రిత్వ శాఖకు చెందిన పీఎంజీవై (యూ) మిషన్ అధికారి అభిషేక్ మిశ్రాతో పాటు ఇతర అధికారుల బృందం శనివారం పరిశీలించింది. ఈ సందర్భంగా డబుల్ బెడ్ రూం ఇండ్ల పనులు, నాణ్యతను పరిశీలించారు. త్వరగా నిర్మాణ పనులు పూర్తిచేసి లబ్ధిదారులకు అందజేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే సిమెంట్ కాంక్రీట్ పరీక్షలను వరంగల్ నిట్ ల్యాబ్‌లో, ప్రైవేట్‌లో కాకుండా జనగామలోనే ఏర్పాటు చేసుకోవాలని సంబంధిత నోడల్ అధికారికి సూచించారు. కార్యక్రమంలో జిల్లా నోడల్ అధికారి డీ దామోదర్‌రావు, పంచాయతీరాజ్ డిప్యూటీ ఈఈ జీ కృష్ణ, సహాయక ఇంజినీర్లు జీ నర్సింహారెడ్డి, పీవీ భవానీశంకర్, ఎస్ నాగభూషణం, గృహ నిర్మాణ శాఖ సహాయ ఇంజినీర్ ఎన్ చంద్రశేఖర్, కిశోర్ తదితరులు పాల్గొన్నారు.