శనివారం 27 ఫిబ్రవరి 2021
Jangaon - Feb 07, 2021 , 01:38:07

నిధులు కేటాయించాలని మంత్రి ఎర్రబెల్లికి వినతి

నిధులు కేటాయించాలని మంత్రి ఎర్రబెల్లికి వినతి

రఘునాథపల్లి, ఫిబ్రవరి 6 : మండలంలోని కంచనపల్లి గ్రామాభివృద్ద్ధికి నిధులు కేటాయించాలని కోరుతూ మాజీ ఎంపీటీసీ గవ్వాని నాగేశ్వర్‌రావు ఆధ్వర్యంలో టీఆర్‌ఎస్‌ నాయకులు శనివారం హన్మకొండలో పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ.. కంచనపల్లి నుంచి ఇప్పగూడెం వరకు దారి, దేవాదుల కాల్వపై బ్రిడ్జి, శ్మశానవాటికు దారి, డంపింగ్‌యార్డు, ఇతర అభివృద్ధి పనులకు నిధులు కేటాయించాలని కోరారు. దీంతో మంత్రి సానుకూలంగా స్పందించి నిధులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారని అన్నారు. మంత్రిని కలిసిన వారిలో నాయకులు జోసఫ్‌, సాంబరాజు రమేశ్‌, రాజు, మోహన్‌, శ్రీనివాస్‌ పాల్గొన్నారు. 

ఎఫ్‌ఎస్‌సీఎస్‌ మాజీ చైర్మన్‌కు మంత్రి ఎర్రబెల్లి పరామర్శ

పాలకుర్తి రూరల్‌, ఫిబ్రవరి 6 : ఎఫ్‌ఎస్‌సీఎస్‌ బ్యాంక్‌ మాజీ చైర్మన్‌, టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకుడు అడ్డూరి మాధవరావు, టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకుడు దొంతమల్ల గణేశ్‌ రోడ్డు ప్రమాదంలో ఇటీవల గాయపడి మ్యాక్స్‌ కేర్‌ దవాఖానలో చికిత్స పొందుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం వారిని రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పరామర్శించారు. ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ఆయన వెంట ఎంపీపీ నల్లానాగిరెడ్డి ఉన్నారు.


VIDEOS

logo