శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Feb 07, 2021 , 01:59:32

సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాలి : డీసీపీ

సెక్యూరిటీ కౌన్సిల్‌ను ఏర్పాటు చేసుకోవాలి : డీసీపీ

జనగామచౌరస్తా, ఫిబ్రవరి 6: జిల్లా కేంద్రంలోని పోలీస్‌ హెడ్‌ క్వార్టర్స్‌లో పారిశ్రామిక వేత్తలతో కలిసి వెస్ట్‌జోన్‌ డీసీపీ శ్రీనివాస్‌రెడ్డి శనివారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..జిల్లాలో సెక్యూరిటీ కౌన్సిల్‌ ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. నేరాల నియంత్రణకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. పరిశ్రమల్లోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలన్నారు. కార్యక్రమానికి జనగామ ఏసీపీ ఎస్‌ వినోద్‌కుమార్‌, వర్ధన్నపేట ఏసీపీ జీ రమేశ్‌, సీఐలు మల్లేశ్‌ యాదవ్‌, విశ్వేశ్వర్‌, శ్రీనివాస్‌రెడ్డి, చేరాలు, బాలాజీ, సంతోశ్‌తో పాటు జిల్లాలోని రైస్‌మిల్స్‌, కాటన్‌ మిల్స్‌, క్రషర్స్‌ నిర్వాహకులు పాల్గొన్నారు.


VIDEOS

logo