ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Feb 06, 2021 , 01:24:35

కార్మిక బాంధవుడు కేసీఆర్‌

కార్మిక బాంధవుడు కేసీఆర్‌

  • ఉద్యోగ భద్రత కల్పించడంపై డ్రైవర్లు, కండక్టర్ల హర్షం
  • జనగామ, భూపాలపల్లి ఆర్టీసీ డిపోల 
  • ఆవరణలో సీఎం చిత్రపటాలకు పాలాభిషేకంకార్మిక బాంధవుడు సీఎం కేసీఆర్‌
  • ఉద్యోగ భద్రత కల్పించడంపై ఆర్టీసీ కార్మికుల హర్షం

జనగామ, నమస్తే తెలంగాణ 5 : ఆర్టీసీలో ఉద్యోగాలకు భద్రత కల్పిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలు ఖరారు చేయడంపై ఆర్టీసీ డ్రైవర్లు, కండక్టర్లు, అధికారులు సంబురాల్లో మునిగితేలారు. శుక్రవారం జనగామ, భూపాలపల్లి ఆర్టీసీ డిపోల ఎదుట సీఎం కేసీఆర్‌, రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్‌ చిత్రపటాలకు క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆర్టీసీ ఉద్యోగులు మాట్లాడుతూ.. లక్షలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మికుల బాంధవుడిగా సీఎం కేసీఆర్‌ అందరి హృదయాల్లో చెరగని ముద్రవేసుకున్నారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత శ్రమను నమ్ముకొని పనిచేస్తున్న వారిని గుర్తించిన ఏకైక నాయకుడిగా చరిత్రలో నిలుస్తారన్నారు. ఆయా కార్యక్రమాల్లో జనగామ డిపో మేనేజర్‌ ధరంసింగ్‌, సీఐ శ్రీకాంత్‌, ముత్తయ్యగౌడ్‌, శ్రీనివాస్‌, భూపాలపల్లి డిపో మేనేజర్‌ లక్ష్మీధర్మ, డ్రైవర్లు, కండక్టర్లు పాల్గొన్నారు.

VIDEOS

logo