రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్ ధ్యేయం

- ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి
జనగామ రూరల్, ఫిబ్రవరి 4: వ్యవసాయాన్ని పండుగలా మార్చిన సీఎం కేసీఆర్ రైతును రాజు చేయడమే ధ్యేయంగా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాల అమలుతోపాటు పంటల సాగులో వ్యవసాయ అధికారులు, శాస్త్రవేత్తల నుంచి సలహాలు తీసుకునేందుకు రైతు వేదికలు నిర్మిస్తున్నట్లు చెప్పారు. మండలంలోని చౌడారం, వడ్లకొండ, గానుగుపహాడ్ గ్రామాల్లో నిర్మించిన రైతు వేదికలను గురువారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశాల్లో ముత్తిరెడ్డి మాట్లాడుతూ తెలంగాణలో అమలు చేస్తున్న పథకాలను ప్రధానమంత్రి మోదీ పార్లమెంటులో పలుమార్లు గుర్తు చేసి సీఎం కేసీఆర్‌ను ప్రశంసించారన్నారు. కానీ బీజేపీ నాయకులు మాత్రం తమ ఉనికి కోసం రాష్ట్ర ప్రభుత్వంపై విమర్శలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. సీఎంను విమర్శిస్తే ప్రధానమంత్రిని విమర్శించినట్లని వారికి హితవు పలికారు. గతంలో సాగు, తాగు నీటికోసం నానా ఇబ్బందులకుగురైన ఈ ప్రాంత రైతులకు సీఎం కేసీఆర్ గోదావరి జలాలను అందిస్తున్నారని గుర్తు చేశారు. నిరంతర విద్యుత్‌తో పంటల సాగు పెరిగిందన్నారు. గ్రామాల్లో సీసీ రోడ్ల నిర్మాణం చేపట్టామని, పల్లెప్రగతి కార్యక్రమాలతో గ్రామాల్లో అభివృద్ధి జరుగుతున్నదన్నారు. పంటల సాగుతోపాటు సీజనల్ వారీగా రైతులు తమ సమస్యలను ఒక వేదికపై చర్చించుకుని అధికారుల సలహాలు తీసుకునేందుకు రైతువేదికలు ఎంతగానో ఉపయోగపడుతాయని ముత్తిరెడ్డి తెలిపారు.
వాటర్ ట్యాంకు నిర్మాణానికి భూమిపూజ
చౌడారంలో వాటర్ ట్యాంకు నిర్మాణానికి ఎమ్మెల్యే ముత్తిరెడ్డి భూమిపూజ చేశారు. అనంతరం వడ్లకొండలో ట్యాంకు నిర్మాణంపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా పాఠశాలలో మూత్రశాలలను పరిశీలించి విద్యార్థులకు అందిస్తున్న మధ్యాహ్న భోజన నాణ్యతను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో రైతుబంధు సమితి జిల్లా కోఆర్డినేటర్ ఇర్రి రమణారెడ్డి, డీఈ అనిల్, టీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి, ఎంపీపీ మేకల కళింగరాజు, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బైరగోని యాదగరిగౌడ్, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు బూరెడ్డి ప్రమోద్‌రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షురాలు బొల్లం శారదాస్వామి, జడ్పీటీసీ దీపిక, టీఆర్ఎస్ మండల కార్యదర్శులు ఎడ్ల శ్రీనివాస్, స్వామి, అమృతరావు. పీఏసీఎస్ చైర్మన్లు చిర్ర శ్రీనివాస్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, సర్పంచ్‌లు సానబోయిన శ్రీనివాస్, రాజయ్య, రేణుక, స్వరూప, మంజుల, దీపక్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి
నర్మెట : రాష్ట్ర ప్రభుత్వం రైతుల కోసం అమలు చేస్తున్న పథకాలను వినియోగించుకోవాలని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. జిల్లా సహకార కేంద్ర బ్యాంకు ఆధ్వర్యంలో రెండు వరికోత మిషన్లు, ట్రాక్టర్‌ను 50 శాతం సబ్సిడీపై ప్రభుత్వం మంజూరు చేయగా గురువారం లబ్ధిదారులకు ఆయన అందించారు. ముత్తిరెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం రైతులను ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు చేయూతనిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్ కేశిరెడ్డి ఉపేందర్‌రెడ్డి, ఎంపీపీ తేజావత్ గోవర్ధన్, సర్పంచ్ల ఫోరం నర్మెట, తరిగొప్పుల మండలాల అధ్యక్షులు కమలాకర్‌రెడ్డి, బీరెడ్డి జార్జిరెడ్డి, టీఆర్ఎస్ నియోజకవర్గ కోఆర్డినేటర్ గుజ్జ సంపత్‌రెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు చింతకింది సురేశ్, ఎంపీటీసీ మురళి పాల్గొన్నారు.
తాజావార్తలు
- వికెట్లు టపటపా..భారత్ 145 ఆలౌట్
- పారిశుద్ధ్యాన్ని పక్కాగా చేపట్టాలి : డా. యోగితా రాణా
- నియంత్రణ సంస్థ పరిధిలోకి డిజిటల్ న్యూస్!
- రాజ్‌నాథ్‌సింగ్ పంజరంలో పక్షి : రైతు నేత నరేశ్ తికాయత్
- మహేశ్‌బాబుకు పెద్ద చిక్కే వచ్చింది..అదేంటో తెలుసా..?
- భార్య టీ చేయకపోవడం.. భర్తను రెచ్చగొట్టి దాడికి ప్రేరేపించడం కాదు..
- చేనేతకు చేయూతనిద్దాం : మంత్రి నిరంజన్ రెడ్డి
- జీడీపీలో అసోం వాటా పెరిగేవరకూ అలసట లేని పోరు : అమిత్ షా
- నా మీటింగ్‌కు అనుమతి ఇవ్వడం లేదు..
- స్వల్ప వ్యవధిలోనే మూడు వికెట్లు కోల్పోయిన భారత్