ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Feb 04, 2021 , 01:22:07

రైతు వేదికలు చైతన్య దీపికలు

రైతు వేదికలు చైతన్య దీపికలు

  • ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి

జనగామ రూరల్‌, ఫిబ్రవరి 3 : రైతు వేదికలు చైతన్య దీపికలు అని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి  అన్నారు. బుధవారం మండలంలోని పెద్దపహాడ్‌, ఓబుల్‌కేశ్వాపూర్‌ గ్రామాల్లో రైతు వేదికలను ప్రారంభించగా, శామీర్‌పేటలో డీఆర్‌డీఏ సెర్ప్‌ అధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేసిన బైరిసన్స్‌ ఎస్‌హెచ్‌జీ స్టోర్‌ను ఆయన ప్రారంభించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ కృషితో గోదావరి జలాలు తెలంగాణలోని ప్రతి చెరువుకూ చేరుతున్నాయని, దీంతో ఎక్కడ చూసినా పొలాలు పచ్చగా పరుచుకున్నాయని తెలిపారు. గతం లో తాగునీటికి అరిగోస పడిన ఈనేల ఇప్పుడు మిషన్‌ భగీరథతో దాహాన్ని తీర్చుకుంటున్నదన్నారు. రైతును రాజు చేయడమే పట్టుదలగా కేసీఆర్‌ కృషి చేస్తుంటే కేంద్రం మోకాలడ్డు వేస్తున్నదన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం వ్యవసాయాన్ని పండుగ చేసిందన్నారు. పల్లె ప్రగతితో నేడు గ్రామాలన్నీ మెరుస్తున్నాయన్నారు. పెద్దపహాడ్‌లో రైతు వేదిక ప్రారంభించిన అనంతరం ఎమ్మెల్యే ముత్తిరెడ్డి నృత్యం చేశారు. ఓబుల్‌ కేశ్వాపూర్‌లో వ్యవసాయశాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వ్యవసాయ పరికరాలను ఎమ్మెల్యే పరిశీలించి వాటి పని తీరును తెలుసుకున్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీద్‌, రైతు బంధు సమితి జిల్లా కోఆర్డినేటర్‌ ఇర్రి రమణారెడ్డి, జిల్లా వ్యవసాయ శాఖ అధికారి నర్సిం గం, డీఆర్డీఏ అదనపు పీడీ నూరొద్దీన్‌ తదితరులు పాల్గొన్నారు. 


VIDEOS

logo