రైతు సంక్షేమమే తెలంగాణ సర్కారు ధ్యేయం

కొడకండ్ల, ఫిబ్రవరి 2 : రైతు సంక్షేమమే తెలంగాణ స ర్కారు ధ్యేయమని, ఇందుకనుగుణంగానే సీఎం కేసీఆర్ దేశం లో ఎక్కడాలేని విధంగా రా ష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తున్నారని కొడకండ్ల మార్కెట్ కమిటీ చైర్మన్ పేరం రాము అన్నారు. మార్కెట్ పాలకవర్గ పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించిన నేపథ్యంలో ఆయనతోపాటు కమిటీ సభ్యులు మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా రాము మాట్లాడుతూ మార్కెట్ కమిటీ పదవీ కాలాన్ని పొడిగించిన సీఎం కేసీఆర్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఎర్రబెల్లి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ ఎర్రబెల్లి ఉషాదయాకర్‌రావు మాట్లాడుతూ పా లకుర్తి నియోజక వర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధి చేసేందుకు మంత్రి ద యాకర్‌రావు కృషి చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ వైస్ చైర్మన్ కుందూరు వెంకటేశ్వర్‌రెడ్డి, ఎంపీపీ జ్యోతి రవీంద్రగాంధీనాయక్, జడ్పీటీసీ కేలోత్ సత్తెమ్మ, మాజీ జీసీసీ చైర్మన్ గాంధీనాయక్, రైతుబంధు సమితి జిల్లా సభ్యుడు సిందె రామోజీ, సర్పంచ్ పసునూ రి మధుసూదన్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- అమితాబ్ ఆరోగ్యంపై తాజా అప్డేట్..!
- స్వదస్తూరితో బిగ్ బాస్ బ్యూటీకు పవన్ సందేశం..!
- ఉపాధి హామీ పనులకు జియో ట్యాగింగ్
- 21 రోజులపాటు మేడారం ఆలయం మూసివేత
- మళ్లీ పెరిగిన గ్యాస్ సిలిండర్ ధర
- రేయ్ రేయ్ రేయ్.. ‘అల్లరి నరేష్’ పేరు మార్చేయ్ ..
- పూరీ వారసుడు ఈ సారైన హిట్ కొడతాడా..!
- కరోనా టీకా తీసుకున్న ప్రధాని మోదీ
- తెలుగు ఇండస్ట్రీలో విషాదం.. యువ నిర్మాత కన్నుమూత
- మన వ్యాక్సిన్ సురక్షితమైంది: హీరో సందీప్‌కిషన్