శుక్రవారం 05 మార్చి 2021
Jangaon - Feb 03, 2021 , 01:33:22

నేడు ఏబీవీ డిగ్రీ కళాశాలను సందర్శించనున్న ‘న్యాక్‌'

నేడు ఏబీవీ డిగ్రీ కళాశాలను సందర్శించనున్న ‘న్యాక్‌'

జనగామ టౌన్‌, ఫిబ్రవరి 2 : జనగామలోని ఏబీవీ ప్రభుత్వ డిగ్రీ కళాశాలను నేషనల్‌ అసెస్‌మెంట్‌ అండ్‌ అక్రిడేషన్‌ కౌన్సిల్‌ (న్యాక్‌) బృందం బుధవారం సందర్శించనుంది. దీనికి సంబ ంధించిన వివరాలను కళాశాల ప్రిన్సిపాల్‌ డాక్టర్‌ ఈ శ్రీనివాస్‌రావు మంగళవారం విలేకరులకు తెలిపారు. రెండు రోజులపాటు కళాశాలలోని వివిధ విభాగాలను ‘న్యాక్‌' బృందం పరిశీలిస్తుందని ఆయన పేర్కొన్నారు. ఐదేళ్లకోసారి జరిగే న్యాక్‌ పర్యటన కోసం కళాశాలను అత్యంత సుందరంగా తీర్చిదిద్దామని ఆయన చెప్పారు. రాష్ట్రంలోనే ప్రముఖ కళాశాలగా గుర్తింపు పొందిన ఏబీవీ ప్రభు త్వ డిగ్రీ కళాశాలలో చదివిన అనేక మంది ఉన్నత స్థాయిలో ఉ న్నారని తెలిపారు. ప్ర స్తుతం కళాశాలలో 14 విభాగాల్లో 950 మంది విద్యార్థులుండగా, 30 మంది అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారని శ్రీనివాస్‌రావు వెల్లడించారు. గతంలో న్యాక్‌ పరిశీలనలో బీ గ్రేడ్‌ సాధించిన కళాశాల ప్రస్తుతం అత్యుత్తమ గ్రేడ్‌ సా ధించేందుకు అధ్యాపక బృందం శక్తి వంచన లే కుండా కృషి చేస్తున్నదని తెలిపారు.


VIDEOS

logo