ఆదివారం 07 మార్చి 2021
Jangaon - Jan 31, 2021 , 00:17:21

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయం

  • ఎమ్మెల్యే డాక్టర్‌ తాటికొండ రాజయ్య

లింగాలఘనపురం, జనవరి 30 : రైతును రాజు చేయడమే సీఎం కేసీఆర్‌ ధ్యేయమని, ఇందుకనుగుణంగా అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నారని స్టేషన్‌ఘన్‌పూర్‌ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య అన్నారు. శనివారం మండలంలోని చీటూరు వాగుపై రూ.2.80 కోట్లతో నిర్మించనున్న చెక్‌డ్యామ్‌కు ఆయన శంకుస్థాపన చేశారు. అనంతరం సర్పంచ్‌ ఐల మల్లేశం అధ్యక్షతన జరిగిన సమావేశంలో రాజయ్య మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ సాగునీటి ప్రాజెక్టులతోపాటు వాగులపై చెక్‌డ్యామ్‌ల నిర్మాణానికి పెద్ద ఎత్తున నిధులు మంజూరుచేస్తున్నారన్నారు. చెక్‌డ్యామ్‌ నిర్మాణంతో  చీటూరు, కోడూరు గ్రామాల్లో అదనంగా 250 ఎకరాలకు సాగు నీరు అందడంతోపాటు భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. అంతకు ముందు లింగాలఘనపురంలో తహసీల్దార్‌ శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సమావేశంలో కల్యాణలక్ష్మి పథకంలో 57 మంది లబ్ధిదారులకు రూ, 58 లక్షల 6 వేల 612 విలువైన చెక్కులను రాజయ్య అందజేశారు. ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి, ఎంపీపీ చిట్ల జయశ్రీ, కొమురవెల్లి దేవస్థాన మాజీ చైర్మన్‌ సేవెల్లి సంపత్‌, నాయకులు బొల్లంపెల్లి నాగేందర్‌, ఉడుగుల భాగ్యలక్ష్మి, ఉప్పల మధు, సోమలక్ష్మి, యాదయ్య, మాజీ జడ్పీటీసీ గంగసాని రంజిత్‌రెడ్డి, ఎంపీడీవో సురేందర్‌, నాయకులు సుధీర్‌రెడ్డి, ఐబీ ఈఈ శశిభూషణ్‌, ఏఈ  అభిరామ్‌  పాల్గొన్నారు.  


VIDEOS

logo