శనివారం 06 మార్చి 2021
Jangaon - Jan 31, 2021 , 00:17:23

పల్లెప్రగతిలో పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాలి

పల్లెప్రగతిలో పూర్తయిన పనులకు బిల్లులు చెల్లించాలి

  • అధికారులతో కలెక్టర్‌ నిఖిల 

జనగామ చౌరస్తా, జనవరి 30 : పల్లెప్రగతిలో భాగంగా గ్రామాల్లో పూర్తయిన అభివృద్ధి పనులకు బిల్లులు చెల్లించాలని, ఇందుకోసం ఎఫ్‌టీవోలు తయారు చేయాలని జిల్లా కలెక్టర్‌ కే నిఖిల అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్‌ సమావేశ మందిరంలో వివిధ శాఖల అధికారులతో ఆమె సమావేశం నిర్వహించారు. వైకుంఠధామాల్లో మిగిలిన పనులు, నర్సరీలు, లేబర్‌ టర్నోవర్‌, పారిశుధ్యంపై ఆమె సమీక్షించారు. ఎఫ్‌టీవోలు తయారు చేయని పనులకు సంబంధించి కారణాలతో నివేదికను సంబంధిత ఎంపీడీవో సంతకంతో సమర్పించాలన్నారు. ఫెన్సింగ్‌ తదితర పనులకు గ్రామ పంచాయతీ నుంచి నిధులు ఖర్చు చేయొచ్చని, ఉపాధి హామీ నిధులు వచ్చాక వాటిని గ్రామ పంచాయతీకి జమ చేయాలన్నారు. బ్యాగ్‌ ఫిల్లింగ్‌, సీడ్‌ డబ్లింగ్‌ కాని నర్సరీల్లో వెంటనే పూర్తి చేయాలన్నారు. చనిపోయిన మొక్కల స్థానంలో కొత్త వాటిని నాటాలన్నారు. ఆవాసాల్లో ఉన్న పల్లెప్రకృతి వనాల్లో నాటని మొక్కలు ఉంటే, వెంటనే అందుబాటులో ఉన్న మొక్కలతో పూర్తి చేయాలన్నారు. ప్రతి గ్రామ పంచాయతీకి 50 మందికి తక్కువ కాకుండా కూలీలను సమీకరించాలన్నారు. జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులంతా శానిటేషన్‌ యాప్‌లో విధిగా లాగిన్‌ కావాలన్నారు. పన్నుల వసూలు వంద శాతం పూర్తి చేయాలని ఆమె ఆదేశించారు. జిల్లాలోని 197 పాఠశాలల్లో 9వ తరగతి నుంచి ఆపై తరగతులకు ఫిబ్రవరి 1 నుంచి పాఠశాలలు పునఃప్రారంభమవుతున్న దృష్ట్యా పారిశుధ్యానికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. అధికారులు తమ పరిధిలోని పాఠశాలల్లో పారిశుధ్యం, తరగతి గదిలో 20 మంది విద్యార్థులకే అనుమతి, మాస్కులు ధరించడం తోపాటు భౌతికదూరం పాటించేలా తీసుకున్న చర్యలు, మధ్యాహ్న భోజనం ఏర్పాట్లు, లిక్విడ్‌ సోప్‌, శానిటైజర్‌ అందుబాటులో ఉండేలా పరిశీలించి నివేదిక సమర్పించాలన్నారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్‌ అబ్దుల్‌ హమీ ద్‌, డీఆర్డీవో రాంరెడ్డి, డీపీవో రంగాచారి, ఎంపీడీవోలు, ఎంపీవోలు, ఏపీవోలు, ఈసీలు పాల్గొన్నారు. 


VIDEOS

logo