సోమవారం 08 మార్చి 2021
Jangaon - Jan 31, 2021 , 00:17:23

ట్రాన్స్‌ జెండర్‌కు తొలి డ్రైవింగ్‌ లైసెన్స్‌

ట్రాన్స్‌ జెండర్‌కు తొలి డ్రైవింగ్‌ లైసెన్స్‌

జనగామ టౌన్‌, జనవరి 30 : సమాజంలో అన్ని రంగాల్లో వివక్షకు గురవుతున్న ట్రాన్స్‌జెండర్‌కు తొలి డ్రైవింగ్‌ లైసెన్స్‌ అందజేశారు. శనివారం రవాణా శాఖ కార్యాలయంలో జిల్లా కేంద్రానికి చెందిన ట్రాన్స్‌ జెండర్‌ ఓరుగంటి డాలికి మోటర్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌ శోభన్‌ బాబు డ్రైవింగ్‌ లైసెన్స్‌ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని రంగాల్లో ట్రాన్స్‌జెండర్లు ముందుకు వస్తున్నారన్నారు. కానిస్టేబుల్‌ వెంకటేశ్‌, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo