సోమవారం 01 మార్చి 2021
Jangaon - Jan 30, 2021 , 00:25:39

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

అభివృద్ధి పనులు సకాలంలో పూర్తి చేయాలి

  • జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి

బచ్చన్నపేట, జనవరి 29 : తెలంగాణ ప్రభుత్వం పల్లెల అభివృద్ధి కోసం చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసి ప్రతి గ్రామా న్ని అభివృద్ధిలో ముందుండేలా కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రంగాచారి అన్నారు. శుక్రవారం మండలంలోని లక్ష్మాపూర్‌ గ్రామాన్ని ఆయన సందర్శించి ఇన్‌స్పెక్షన్‌ యాప్‌ను పరిశీలించారు. శ్మశానవాటిక, పల్లెప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్‌యార్డు పనులను పర్యవేక్షించారు. తాగునీరు సక్రమంగా సరఫరా అవుతుందా, చెత్త బుట్టలు రెండు చొప్పున  ఇచ్చారా, వీధి లైట్లు సక్రమంగా వెలుగుతున్నా యా అని ప్రజలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం రంగాచారి మాట్లాడుతూ ప్రభుత్వం అం దించే ప్రతి పైసాను పారదర్శకంగా ఖర్చు చేస్తున్నట్లు చెప్పారు. సిబ్బంది వేతనాలు, కరంటు బిల్లులు సకాలంలో చెల్లించాలన్నారు. కొత్తగా ఏర్పాటైన లక్ష్మాపూర్‌ గ్రామాన్ని మరింతగా అభివృద్ధి చేసేందుకు సర్పంచ్‌, పంచాయతీ కార్యదర్శి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్‌ నవ్యానర్సిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి చక్రధర్‌ తదితరులు పాల్గొన్నారు.


VIDEOS

logo