తెలంగాణలో ఉపాధిహామీ పనులు భేష్

- ఈజీఎస్ సెంట్రల్టీమ్ ఆడిటర్ దినేశ్‌చంద్ర
- నెల్లుట్ల, జీడికల్లో అభివృద్ధి పనుల పరిశీలన
లింగాలఘనపురం, జనవరి 29 : సీఎం కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రంలో ఉపాధిహామీ పనులు భేషుగ్గా జరుగుతున్నాయని ఈజీఎస్ కేంద్రం బృందం ఆడిటర్ దినేశ్‌చంద్ర అన్నారు. మండలంలోని నెల్లుట్ల, జీడికల్ గ్రామా ల్లో ఉపాధిహామీ పథకంలో చేపట్టిన పనులను కేంద్ర బృం దం సభ్యులు శుక్రవారం పరిశీలించారు. అనంతరం నెల్లుట్లలో సర్పంచ్ చిట్ల స్వరూపారాణి అధ్యక్షతన జరిగిన సమావేశంలో దినేశ్‌చంద్ర మాట్లాడారు. ఏపీ, తమిళనాడులో మోస్తరుగా పనులు జరుగుతున్నాయని, ఉత్తర భారతంలోని రాష్ర్టాల్లో మందకొడిగా ఉన్నాయన్నారు. కరోనాతో ఎంతో మంది ఉపాధి కోల్పోయి గ్రామాల బాట పట్టారని, అనేక మంది వేల కిలో మీటర్లు కాలినడకతోనే చేరుకున్నారన్నారు. ఇలాంటి క్లిష్టపరిస్థితుల్లోనూ తెలంగాణ రాష్ట్రం వలస కార్మికులకు చేయూతనందించిందన్నారు. నెల్లుట్లలో ఈజీఎస్‌లో 76 పనులు చేపట్టి రూ.28,61,134ను 678 మంది కూలీలకు చెల్లించారని దినేష్చంద్ర వివరించారు. నూతనంగా 38 మందికి జాబ్‌కార్డులు ఇచ్చారన్నారు.
వ్యవసాయ పనులకు అనుసంధానించాలి
ఈజీఎస్ పథకాన్ని వ్యవసాయ పనులకు అనుసంధానించాలని, కలుపుతీత, కోతల సమయంలో కూలీలకు పనులు కల్పించాలని సర్పంచ్ చిట్ల స్వరూపారాణి, వార్డు సభ్యులు దీకొండ రాజు, నరసింహ కేంద్ర బృందం దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై స్పందించిన దినేశ్‌చంద్ర ఈజీఎస్ పథకంలో వ్యవసాయ పనులు చేపట్టేందుకు కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తామని ఆయన తెలిపారు. అవసరమున్న వారు జాబ్ కార్డులకు దరఖాస్తు చేయాలని, ప్రతి ఒక్కరికీ పనులు కల్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేం ద్ర బృందం సభ్యులు నారాయణరెడ్డి, శంకర్, నీర జ, శ్రీలత, శ్రీనివాస్, ఎండీ వలీగౌరి, డీఆర్డీవో రాం రెడ్డి, ఏపీడీ కొండల్‌రెడ్డి, ఎంపీడీవో సురేందర్, ఏపీవో రాజకర్ణ, కార్యదర్శులు శ్రీనివాస్‌రెడ్డి, నాగేశ్వర్రావు, పీఆర్ ఏఈ శ్రీనివాస్, వార్డు సభ్యులు దీకొండ రాజు, నరసింహ, అశో క్, సుమన్, రాజు, నాయకులు చిట్ల భూపాల్‌రెడ్డి, కృష్ణస్వా మి తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- కొట్లాటల కాంగ్రెస్ పట్టభద్రులకేం చేస్తుంది..
- కళ్లెదుటే అభివృద్ధి
- నేటి నుంచి చీదెళ్ల జాతర
- ఆ ఊరు.. ఓ ఉద్యానం
- సంత్ సేవాలాల్ త్యాగం చిరస్మరణీయం
- పెట్రో భారం తగ్గించాలంటే ఇలా చేయాల్సిందే: ఆర్బీఐ
- అరకొర పనులు..
- పకడ్బందీగా పట్టభద్రుల ఎన్నికలు
- విదేశీ నిపుణులకు అమెరికా వీసాపై బ్యాన్ విత్‌డ్రా
- అలాంటి పేరు తెచ్చుకుంటే చాలు!